తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడంపై స్టార్ బౌలర్ బుమ్రా స్పందించారు. ‘ఈ అవార్డు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే గతంలో ఇదే అహ్మాదాబాద్ వేదికగా ఫైనల్ ఆడాం. కానీ గెలవలేకపోయాం. అందుకే ఈ విజయం ఇచ్చే ఆనందం చాలా భిన్నమైనది. ఇక్కడ ఫ్లాట్ పిచ్. అందుకే పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశా. ఇక్కడ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.