భారత మహిళా జట్టు ఏప్రిల్‌లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో ఇద్దరు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్లు కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో వీరు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనకను రూ. 2 కోట్లకు RR తమ జట్టులోకి తీసుకుంది. IPL మినీ వేలంలో షనక అమ్ముడుపోకపోవడంతో, అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు IPL అవకాశం రావడంతో PSL నుంచి తప్పుకున్నాడు.
భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’గా నిలిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయడంతో ఆమె ఈ అవార్డును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపింది. పురుషుల విభాగంలో పాక్ ప్లేయర్ ఫర్హాన్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కావడంతో అతడి స్థానాన్ని ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ పేయిన్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని SRH అధికారికంగా ప్రకటించింది. పేయిన్ T20 క్రికెట్‌లో 233 మ్యాచ్‌లు ఆడి 304 వికెట్లు పడగొట్టాడు. అతడి రాకతో SRH బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్ రానున్న ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అతడు ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని RCB డైరెక్టర్ మో బాబత్ ధ్రువీకరించాడు. కాగా, ఈ సీజన్‌లో RCB తన తొలి మ్యాచ్ ఈనెల 28న SRHతో తలపడనుంది.
గతేడాది RCB విజయోత్సవ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతులకు నివాళులర్పించేందుకు బెంగళూరు జట్టు ఒక భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ 11 సీట్లను ఖాళీగా ఉంచి వారికి అంకితం చేయనున్నారు. ఆ సీట్లను ఎవరికీ కేటాయించకుండా అభిమానుల జ్ఞాపకార్థం రిజర్వ్ చేస్తారు.
పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లు ఫిజికల్, టెక్నికల్, మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలని సూచించారు. ‘మనమందరం పొరపాట్లు చేస్తాం. అందులో తప్పులేదు. కానీ మీ గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నంతకాలం, మీరు ఒక తప్పు చేసినా, నా దృష్టిలో అది తప్పు కాదు. క్రికెట్‌లో ఇవన్నీ సహజం. అది ఆటలో ఒక భాగం’ అని పేర్కొన్నాడు.
భారత క్రికెటర్ రింకూ సింగ్‌కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతీయ క్రీడా అధికారి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించింది. 2026 T20 ప్రపంచ కప్‌లో ప్రదర్శన, అంతర్జాతీయ పతకాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యకుమార్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత జట్టులో రింకూ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమౌతాడని భావించిన ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. నేడు నేరుగా బెంగళూరుకు చేరుకుని.. జట్టుతో కలవనున్నాడు. అయితే ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కాగా ఈనెల 28న IPL-19 సీజన్ ప్రారంభం కానుంది.
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. హార్దిక్ పాండ్యను తప్పించి MIకి సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఆకాంక్షించారు. సూర్య నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. అయితే పాండ్య నాయకత్వ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నారు.
IPL-2026 సీజన్ నేపథ్యంలో RCB బౌలింగ్ విభాగంపై దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో డఫీ, తుషార వంటి నాణ్యమైన బ్యాకప్ బౌలర్లు ఉన్నప్పటికీ.. జోష్ హేజెల్‌వుడ్ లేని RCB పూర్తిగా భిన్నమైన జట్టుగా కనిపిస్తుందని పేర్కొన్నాడు. అతడి అనుభవం, వికెట్లు తీసే సామర్థ్యం జట్టుకు అత్యంత కీలకమని తెలిపాడు. అతడికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టమని వ్యాఖ్యానించాడు.
IPL-2026 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా ఇంకా జట్టుతో కలవకుండా, నేరుగా బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతను ఏదైనా గాయం కారణంగా అక్కడికి వెళ్ళాడా..? లేదా సాధారణ ఫిట్‌నెస్ పరీక్షల కోసమేనా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
LSG ప్లేయర్ అర్జున్ టెండూల్కర్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘లక్నో జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నందున అర్జున్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం చాలా కష్టం’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కేవలం పేరు ఉంటే సరిపోదని, జట్టు ఎంపికలో ఆటతీరుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నాడు. అర్జున్ తనను తాను నిరూపించుకోవాలని తెలిపాడు.
T20 WC విజయం తర్వాత భారత క్రికెటర్లు ఆలయాలను సందర్శించడంపై SMలో వస్తున్న విమర్శలపై అక్షర్ పటేల్ స్పందించాడు. మైదానంలో పోరాడి గెలిచినప్పుడు, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మొక్కులు తీర్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ‘విజయం దక్కినప్పుడు గుడికి వెళ్లడం ఒక మంచి పద్ధతి, అది మా వ్యక్తిగత విశ్వాసం’ అని అక్షర్ పేర్కొన్నాడు.
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. T20 WCలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా అతడు ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈ రేసులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌ను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం.