• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

సంజూ ‘షో’ మొదలవుతుంది: శ్రీకాంత్

IPLలో భాగంగా ఈరోజు పంజాబ్‌తో CSK తలపడనుంది. RR చేతిలో ఓడిన CSK.. ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటుందని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. అలాగే, సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో అదరగొడతాడని పేర్కొన్నాడు. సంజూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, అతని టాలెంట్ గురించి అందరికీ తెలిసిందేనని అన్నాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో అతడు కమ్ బ్యాక్ ఇస్తాడని వ్యాఖ్యానించాడు.

April 3, 2026 / 02:46 PM IST

IPL 2026: పంజాబ్‌ను చెన్నై కట్టడి చేసేనా?

IPL 2026లో భాగంగా ఇవాళ జరిగే చెన్నై vs పంజాబ్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచ్‌ల్లో 16-16 విజయాలతో ఇరుజట్లు పోటాపోటీగా ఆడాయి. అయితే చివరి 8 మ్యాచ్‌లకు ఏడింటిలో చెన్నై పంజాబ్ గెలవడం గమనార్హం. ధోనీ లేకుండా ఆడిన 6 సందర్భాల్లో ఒక్కసారే గెలిచిన చెన్నై.. 7వ సందర్భంలో తమను డామినేట్ చేస్తున్న పంజాబ్‌ను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.

April 3, 2026 / 07:54 AM IST

క్రికెటర్లు గోల్ఫ్ ఆడాలి: యువరాజ్

మైదానంలో ఉండే ఒత్తిడి నుంచి బయపడపడేందుకు క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్ ఆడటం అలవాటు చేసుకోవాలని మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ సూచించాడు. 2025లో ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్(IGPL)కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. తన క్రికెట్ కెరీర్‌లో గోల్ఫ్ ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు. గోల్ఫ్ మనసునే తేలికపరుస్తుందని పేర్కొన్నాడు.

April 3, 2026 / 07:33 AM IST

ముంబై జట్టులో చేరిన స్టార్ ఆల్‌రౌండర్

న్యూజిలాండ్ T20 కెప్టెన్ మిచెల్ శాంట్నర్ IPL 2026 కోసం ముంబై జట్టులో చేరాడు. వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌కు ఆలస్యంగా చేరుకున్నాడు.  శాంట్నర్ రాకతో ముంబై మిడిలార్డర్ మరింత పటిష్ఠం కానుంది. ఇక మరో ఆల్‌రౌండర్ విల్ జాక్స్(ENG) కూడా త్వరలోనే జట్టులో చేరనున్నాడు. కాగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై.. రేపు ఢిల్లీతో తలపడనుంది.

April 3, 2026 / 06:50 AM IST

IPL: నేడు చెన్నై vs పంజాబ్

IPL 2026లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్స్ కింగ్స్ తలపడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. గుజరాత్‌పై తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ గెలవగా.. రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడింది. దీంతో తొలి విజయం కోసం చెన్నై, ఇందులోనూ గెలిచి విజయోత్సాహాన్ని కొనసాగించాలని పంజాబ్ భావిస్తున్నాయి.

April 3, 2026 / 06:24 AM IST

రింకూ సింగ్ సరికొత్త రికార్డు

KKR ఆటగాడు రింకూ సింగ్ ఫీల్డింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. KKR తరఫున అత్యధిక క్యాచ్‌లు (41) పట్టిన నాన్ వికెట్‌కీపర్‌గా ఆండ్రీ రసెల్(40) రికార్డును అధిగమించాడు. SRHతో జరిగిన మ్యాచ్‌లో 2 క్యాచ్‌లు పట్టడంతో ఈ ఘనత సాధించాడు. రసెల్ 133 మ్యాచ్‌ల్లో 40 క్యాచ్‌లు పట్టగా, రింకూ కేవలం 61 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

April 3, 2026 / 05:06 AM IST

మహిళా క్రికెటర్లకు GOOD NEWS

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. BCCI సాయం పొందని ప్లేయర్లకు నెలకు రూ.6 వేల నుంచి రూ.12,500 వరకు సాయం అందించనుంది. అలాగే మాజీ పురుష క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్‌ను కూడా పెంచింది. 75 ఏళ్లు పైబడిన వారికి అదనంగా రూ.7,500 అందజేయనున్నారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

April 3, 2026 / 04:28 AM IST

రహానే @ 200: IPLలో అరుదైన మైలురాయి

KKR కెప్టెన్‌ అజింక్య రహానే IPLలో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. SRHతో జరిగిన మ్యాచ్‌తో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా నిలిచాడు. 2008లో అరంగేట్రం చేసిన రహానే, 18 ఏళ్ల ప్రయాణంలో 2 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 5099 పరుగులు చేశాడు. ధోని, రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాల సరసన రహానే చేరడం విశేషం. ఇప్పటివరకు అతడు మొత్తం ఐదు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

April 3, 2026 / 01:22 AM IST

BREAKING: SRH ఖాతాలో తొలి విజయం

KKRతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన KKR.. 16 ఓవర్లలో 161 పరుగుల వద్ద ఆలౌటైంది. రఘువన్షీ(52) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. రింకూ సింగ్ (35)తో రాణించినప్పటికీ వారి శ్రమ వృధా అయ్యింది. SRH బౌలర్లు ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్, ఈషాన్ మలింగా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో SRH బొణీ కొట్టింది.

April 2, 2026 / 11:07 PM IST

పవర్‌ ప్లే పూర్తి.. కేకేఆర్‌ 3 వికెట్లు డౌన్

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో 227 పరుగుల ఛేజింగ్‌లో KKR 6 ఓవర్లకు 74/3 స్కోరు చేసింది. ఫిన్ అలెన్ (28), రహానె (8), గ్రీన్‌ (2) పరుగులు చేశారు. రఘువంశీ (31*), రింకు సింగ్‌ (0*) క్రీజులో ఉన్నారు. హర్ష్‌ దుబే, జయదేవ్‌ ఉనద్కత్‌ చెరో వికెట్‌ తీయగా.. గ్రీన్‌ రనౌటయ్యాడు.

April 2, 2026 / 10:19 PM IST

అభిషేక్‌ శర్మ ఖాతాలో భారీ రికార్డు

SRH ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకుని, మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్ SRH తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడికి ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే SRH తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్లాసెన్ (89), కేన్ విలియమ్సన్ (64), హెడ్ (50) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

April 2, 2026 / 10:08 PM IST

KKR vs SRH: తొలి ఓవర్‌లోనే 25 పరుగులు

SRH నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనను KKR దూకుడుగా ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనే 25 పరుగులు చేసింది. మూడు ఫోర్లు, రెండు సిక్సులతో ఫిన్ ఆలెన్ విరుచుకుపడ్డాడు. అయితే, 1.3 ఓవర్‌లో హర్ష్ దుబే బౌలింగ్‌లో ఆలెన్ (28) ఔటయ్యాడు. రెండు ఓవర్లకు కేకేఆర్ స్కోరు 33-1. అజింక్య రహానె (2), రఘువంశీ (1) క్రీజులో ఉన్నారు.

April 2, 2026 / 09:49 PM IST

IPL 2026: డబుల్‌ సెంచరీ కొట్టిన రహానె

KKR కెప్టెన్ అజింక్య రహానె అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన IPL కెరీర్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్నాడు. SRHతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. IPL చరిత్రలో ఈ మైలురాయిని ఇప్పటివరకు 11 మంది మాత్రమే చేరుకున్నారు. ఈ జాబితాలో ధోనీ (278) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ (273), కోహ్లీ (268) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రహనే తన 18 ఏళ్ల IPL ప్రయాణంలో 5099 పరుగులు చేశాడు.

April 2, 2026 / 09:05 PM IST

KKR vs SRH: నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గింది. క్లాసెన్ (29*), నితీశ్‌ రెడ్డి (20*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ (1) ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

April 2, 2026 / 08:52 PM IST

KKR vs SRH: సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్ తగిలింది. ముజరబానీ బౌలింగ్‌లో (8.2) రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (14) వెనుదిరిగాడు. అదే ఓవర్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (48) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి అనికేత్ వర్మ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

April 2, 2026 / 08:28 PM IST