• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన శ్రీలంక

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంక వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో లంక 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 305 పరుగులు చేయగా.. కివీస్ జట్టు 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో లంక 309 పరుగులతో రాణించండంతో 275 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 211 పరుగులకే కుప్పకూలింది.

September 23, 2024 / 02:35 PM IST

ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదు: దినేశ్‌ కార్తిక్‌

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్  ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్‌ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్‌ కార్తిక్‌ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని..  ఇంకాస్త సమయం ఇవ్వాల...

September 23, 2024 / 12:00 PM IST

ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదు: దినేశ్‌ కార్తీక్

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్  ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్‌ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్‌ కార్తీక్‌ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని..  ఇంకాస్త సమయం ఇవ్వాల...

September 23, 2024 / 12:00 PM IST

ఆఫ్ఘనిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం

ఆఫ్ఘనిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మూడు వన్డే సిరీస్‌లలో రెండు ఓడిపోయిన సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో 169 పరుగులకే ఆఫ్ఘనిస్థాన్ కుప్పకూలింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆఫ్ఘన్ జట్టులో రెహ్మానుల్లా గుర్బాజ్ 89, అల్లా గజన్‌ఫర్ 31 మాత్రమే రాణించారు.

September 23, 2024 / 11:12 AM IST

‘దుఃఖాన్ని దిగమింగి డ్యూటీకి వచ్చాను’

ఇటీవల జరిగిన భారత్-బంగ్లాదేశ్‌ టెస్టుకు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అభినవ్‌ తొలిసారి ఇలాంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన నానమ్మ చనిపోయి 24 గంటలు గడవకముందే మళ్లీ కామెంట్రీ చేసేందుకు వచ్చానని వెల్లడించారు. తన నిర్ణయంపై నాన్నమ్మ సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు.  ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

September 23, 2024 / 10:09 AM IST

నికోలస్ పూరన్ ఊచకోత.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో..!

కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో.. 18.3 ఓవర్లలో...

September 23, 2024 / 10:01 AM IST

చరిత్ర సృష్టించిన భారత్

చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. 2014, 2022లో పురుషుల జట్టు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన. కాగా, 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు పసిడి సాధించి....

September 23, 2024 / 09:05 AM IST

రాష్ట్రస్థాయి పోటీలకు నాయుడుపేట విద్యార్థులు

NLR: నాయుడుపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం వద్ద ఆదివారం రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో పాల్గొనే నెల్లూరు జిల్లా జట్టుకు అండర్-19 విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సారథ్యంలో జరిగే ఈ పోటీలకు గురుకులం నుంచి 8 మంది, సూళ్లూరుపేట బాలికల గురుకులం నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

September 23, 2024 / 09:05 AM IST

నేటి నుంచి మండల స్థాయి ఆటల పోటీలు

VSP: ఆనందపురం హై స్కూల్ గ్రౌండ్లో సోమవారం నుంచి మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్.జి.ఎఫ్ మండల కో-ఆర్డినేటర్ వరప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు రామకృష్ణ పట్నాయక్ పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, చెస్ వంటి ఆటల పోటీలు ఉంటాయన్నారు. ఎంపికైన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తామని తెలిపారు.

September 23, 2024 / 07:04 AM IST

నేటి నుంచి మండలస్థాయి క్రీడాపోటీలు

VSP: తగరపువలస మండలం చిట్టివలస జడ్పీ బాలుర హైస్కూల్ ఆవరణలో సోమవారం నుంచి మూడురోజుల పాటు మండలస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటలపోటీలు జరుగనున్నాయి. అండర్-14, 17 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలలో యోగా, కబడ్డీ, చెస్, ఖోఖో, బాడ్మింటన్, వాలీ బాల్, అథ్లెటిక్స్ నిర్వహించనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. 

September 23, 2024 / 07:01 AM IST

నేడు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు

WG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను పాలకోడేరు మండలం మోగల్లు జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు త్రినాథ్ తెలిపారు. నాలుగు మండలాల్లో పలు పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

September 23, 2024 / 04:35 AM IST

జడేజా అంటే అసూయ.. అభిమానం: అశ్విన్‌

బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయంలో అశ్విన్, జడేజా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జడేజా గురించి అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జడేజాది చాలా స్ఫూర్తిదాయకమైన జీవితం. అతను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూంలో నేను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. జడేజా బ్యాటుతో, బంతితో బెంబేలెత్తించగలడు. ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉంటాడు. అందుకే అతడంటే అసూయ. అలాగే అభి...

September 22, 2024 / 09:19 PM IST

బాల బాలికలకు బహుమతులు అందజేసిన కౌన్సిలర్

NLR: బుచ్చి పట్టణం అరుంధతి వాడలో వినాయక చవితి 16 రోజు పండుగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మూడో వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష విజ్ఞేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన బాలబాలిలకు కౌన్సిలర్ అందే ప్రత్యూష బహుమతులను అందజేశారు.

September 22, 2024 / 08:39 PM IST

చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్‌కు స్వర్ణం

బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024 టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఓపెన్ విభాగంలో తొలిసారి గోల్డ్ మెడల్ సాధించింది. స్లోవేనియా జట్టుతో జరిగిన ఈ మ్యాచులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. స్వర్ణం సాధించిన భారత జట్టులో ప్రజ్ఞానంద, డీ.గుకేష్, అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ ఉన్నారు. కాగా 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జట్టుకు ...

September 22, 2024 / 08:15 PM IST

వన్డేల్లో వరుస విజయాలు.. ఆసీస్ మరో రికార్డు

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇంగ్లాడ్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో ఆసీస్ వరుసగా రెండో విజయం సాధించింది. దీంతో వన్డేలలో ఆ జట్టుకు ఇది వరుసగా 14వ విజయం. దీంతో వన్డే క్రికెట్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా 2003లో 21 వరుస విజయాలతో ఆస్ట్రేలియానే అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డ్‌...

September 22, 2024 / 08:00 PM IST