T20 ప్రపంచకప్-2026లో భాగంగా సెమీస్లో భారత్-పాక్ తలపడితే ఆ మ్యాచ్ MAR 4న జరుగుతుంది. దేశమంతా హోలీ వేడుకల్లో ఉండగా.. శ్రీలంక గడ్డపై దాయాదుల పోరు ఉత్కంఠను పంచనుంది. ఒకవేళ పాక్ కాకుండా మరే ఇతర జట్టుతోనైనా భారత్ సెమీఫైనల్ అడితే ఆ మ్యాచ్ ముందుగా నిర్ణయించినట్లే MAR 5న ముంబైలోనే జరగనుంది. ఈ నిబంధనల ప్రకారం పాక్ ఆడే తొలి సెమీస్ కూడా కోల్కతా నుంచి కొలంబోకు మారుతుంది.