• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IPL హిస్టరీలోనే బిగ్ డీల్

ఐపీఎల్ చరిత్రలో కళ్లు చెదిరే భారీ డీల్ కుదిరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సార్టియం $1.78 బిలియన్లకు(సుమారు రూ.16,732 కోట్లు) దక్కించుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి 100% వాటాను కొనుగోలు చేసిన ఈ ఒప్పందంలో పురుషుల ఐపీఎల్ టీంతో పాటు మహిళల డబ్ల్యూపీఎల్(WPL) టీం కూడా ఉండటం విశేషం.

March 24, 2026 / 11:09 PM IST

ఇంపాక్ట్ రూల్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన కొనసాగుతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా కాకముందే ఈ రూల్ ప్రవేశపెట్టారని తెలిపాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ రూల్ ఎక్కడికీ వెళ్లదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

March 24, 2026 / 10:23 PM IST

ఐపీఎల్ 2026లో కొత్త రూల్

IPL 2026 సీజన్‌లో బీసీసీఐ కొత్త రూల్ తీసుకురానుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ జట్టు 10 ఓవర్ల తర్వాత బంతిని మార్చమని అంపైర్లను కోరవచ్చు. మంచు ప్రభావం వల్ల బౌలర్లు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంపైర్లు పాత బంతికి సమానమైన స్థితిలో ఉన్న మరో బంతితో దానిని మారుస్తారని సమాచారం.

March 24, 2026 / 09:51 PM IST

IPL హిస్టరీలోనే RCB బిగ్గెస్ట్ డీల్

RCB సుమారు రూ.18,800 కోట్లకు ($2 బిలియన్లు) అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికన్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌లతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మార్చి 31లోపు ఈ డీల్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

March 24, 2026 / 09:18 PM IST

CSKలోకి ఆసీస్ స్పీడ్‌స్టర్

IPL- 2026 సీజన్‌కు ముందు CSK జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానంలో, మరో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం అతడితో రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అతడు గతంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

March 24, 2026 / 08:55 PM IST

IPL నుంచి డకెట్ ఔట్.. 3 ఏళ్లు నిషేదం

ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌పై దృష్టి పెట్టడం కోసం ఈ ఏడాది IPLకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. గత వేలంలో రూ.2 కోట్లతో DC డకెట్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడు టోర్నీ నుంచి తప్పుకోవడంతో BCCI నిబంధనల ప్రకారం 3 ఏళ్ల పాటు IPL ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.

March 24, 2026 / 07:50 PM IST

‘ధురంధర్’ డైలాగ్‌తో బుమ్రాను ఆటపట్టించిన భార్య

స్టార్ బౌలర్ బుమ్రా విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు IPL కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బుమ్రా భార్య సంజనా SMలో అతడిని సరదాగా ఆటపట్టించింది. ‘ధురంధర్-2’ చిత్రంలోని ‘నీకు ఇల్లు గుర్తుకు రాలేదా, జస్సీ?’ అనే డైలాగ్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేసి బుమ్రాను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

March 24, 2026 / 07:33 PM IST

భారీ ధరకు అమ్ముడుపోయిన IPL జట్టు..!

ఐపీఎల్‌లోని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం RRను కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 1.63 బిలియన్ డాలర్లతో (రూ.15 వేల కోట్లు) ఈ ఫ్రాంఛైజీని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

March 24, 2026 / 04:30 PM IST

INDw VS SAw: ఏప్రిల్ 17 నుంచి టీ20 సిరీస్

భారత మహిళా జట్టు ఏప్రిల్‌లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో ఇద్దరు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్లు కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో వీరు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

March 24, 2026 / 04:22 PM IST

RR జట్టులోకి లంక ఆల్‌రౌండర్

ఇంగ్లండ్‌ క్రికెటర్ సామ్‌ కరన్‌ గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్‌ దసున్‌ షనకను రూ. 2 కోట్లకు RR తమ జట్టులోకి తీసుకుంది. IPL మినీ వేలంలో షనక అమ్ముడుపోకపోవడంతో, అతడు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు IPL అవకాశం రావడంతో PSL నుంచి తప్పుకున్నాడు.

March 24, 2026 / 03:29 PM IST

అరుంధతి రెడ్డికి ఐసీసీ అవార్డు

భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ఉత్తమ మహిళా క్రికెటర్‌’గా నిలిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయడంతో ఆమె ఈ అవార్డును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపింది. పురుషుల విభాగంలో పాక్ ప్లేయర్ ఫర్హాన్‌ ఈ అవార్డును గెలుచుకున్నాడు.

March 24, 2026 / 03:17 PM IST

SRHలోకి ఇంగ్లండ్ స్పీడ్ స్టార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కావడంతో అతడి స్థానాన్ని ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ పేయిన్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని SRH అధికారికంగా ప్రకటించింది. పేయిన్ T20 క్రికెట్‌లో 233 మ్యాచ్‌లు ఆడి 304 వికెట్లు పడగొట్టాడు. అతడి రాకతో SRH బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.

March 24, 2026 / 02:44 PM IST

RCB జట్టుకు మరో షాక్

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్ యశ్‌ దయాళ్ రానున్న ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అతడు ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని RCB డైరెక్టర్‌ మో బాబత్‌ ధ్రువీకరించాడు. కాగా, ఈ సీజన్‌లో RCB తన తొలి మ్యాచ్ ఈనెల 28న SRHతో తలపడనుంది.

March 24, 2026 / 02:25 PM IST

వారికి 11 సీట్లు రిజర్వ్.. RCB కీలక నిర్ణయం

గతేడాది RCB విజయోత్సవ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతులకు నివాళులర్పించేందుకు బెంగళూరు జట్టు ఒక భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ 11 సీట్లను ఖాళీగా ఉంచి వారికి అంకితం చేయనున్నారు. ఆ సీట్లను ఎవరికీ కేటాయించకుండా అభిమానుల జ్ఞాపకార్థం రిజర్వ్ చేస్తారు.

March 24, 2026 / 01:49 PM IST

క్రికెటర్లు ఫిజికల్‌, మెంటల్‌గా ఫిట్‌ ఉండాలి: పాంటింగ్‌

పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లు ఫిజికల్, టెక్నికల్, మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలని సూచించారు. ‘మనమందరం పొరపాట్లు చేస్తాం. అందులో తప్పులేదు. కానీ మీ గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నంతకాలం, మీరు ఒక తప్పు చేసినా, నా దృష్టిలో అది తప్పు కాదు. క్రికెట్‌లో ఇవన్నీ సహజం. అది ఆటలో ఒక భాగం’ అని పేర్కొన్నాడు.

March 24, 2026 / 12:55 PM IST