కమిన్స్ వచ్చేవరకు IPL 2026లో SRHను ఇషాన్ నడిపించనున్న సంగతి తెలిసిందే. సారథిగా అతనికి మంచి రికార్డే ఉంది. కెప్టెన్‌గా 29 మ్యాచుల్లో 24 విజయాలు అందుకున్నాడు. SMAT 2025లో 11 మ్యాచులకు ఒక్కటే ఓడాడు. జట్టు భారం తనపై ఉన్నా బ్యాట్‌తో ఎక్కడా తగ్గకుండా 43.12 సగటుతో 7 సెంచరీలు చేశాడు. మరి అతని కెప్టెన్సీ స్టైల్ SRHకు పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
చెరో 5 IPL ట్రోఫీలు గెలిచిన MI, CSKలో గొప్ప జట్టు ఏదనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే కొత్త టాలెంట్‌ని వెలికితీసి, ప్రోత్సహించడంలో CSK కంటే MI ముందుంటుందని.. భారత క్రికెట్‌కి ఎందరో గొప్ప ప్లేయర్లను అందించచిన ఘనత ముంబైదే అని స్పష్టంచేశాడు. జట్టులో నలుగురు భారత కెప్టెన్లు ఉన్నప్పటికీ ఒక్కటిగా రాణించడం ముంబైకే సాధ్యమైందని గుర్తుచేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు, కెప్టెన్ ఇషాన్ 25 బంతుల్లోనే 72 పరుగులతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
గత సీజన్ ఫైనల్ గెలిచిన క్షణాలను విరాట్ కోహ్లీ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ‘కీలక వికెట్ పడినప్పుడు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నేను, బయట ఉన్న ఏబీ డివిలియర్స్ ఒకేలా సెలబ్రేట్ చేసుకున్నాం’ అని తెలిపాడు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB తొలిసారి కప్ ముద్దాడిన ఆ చారిత్రాత్మక క్షణం ఎప్పటికీ స్పెషల్ అంటూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
SRH ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. SRH-A జట్టు 253 పరుగులు చేయగా, SRH-B 282 పరుగులు సాధించింది. బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్‌తో మెరిశాడు. 4 ఓవర్లలో కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. IPL ముందు నితీష్ ఫామ్‌లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.
RRలోకి శాంసన్‌కి బదులు వేరొకరిని తీసుకోగలం కానీ, అతని స్థానాన్ని భర్తీ చేయలేమని ఆ టీమ్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. టీమ్ ఏదైనా రోహిత్, కోహ్లీ స్థానాలను ఎలా భర్తీ చేయలేమో.. సంజూ పరిస్థితీ అంతేనన్నాడు. సారథిగా విజయం కోసం ఎక్కడ ఎలా వ్యవహరించాలన్నదానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కాగా ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజూ CSKలో చేరిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ కోచ్‌గా తన 6 నెలల అనుభవం అత్యంత దారుణమని గ్యారీ కిర్‌స్టన్ ఆవేదన వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్ అతిగా జోక్యం చేసుకోవడం, కోచ్‌లకు స్వేచ్ఛ లేకపోవడం వల్లే తాను తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆసీస్ మాజీ పేసర్ గిలెస్పీ కూడా పీసీబీ తీరును తప్పుబడుతూ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ ప్లేయర్లు తిలక్, సూర్య మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం వైరలవుతోంది. IPLలో 3వ స్థానంలో ఆడుతున్నానా లేదా? అని తిలక్ అడగగా.. తనకు తెలియదని, తాను టీమ్ కెప్టెన్ కాదని సూర్య బదులిచ్చాడు. దీనిపై పాండ్యాను అడగమన్నాడు. కాగా రోహిత్ నుంచి MI పగ్గాలను హార్దిక్, భారత T20 జట్టు బాధ్యతలను సూర్య అందుకున్న సంగతి తెలిసిందే.
IPL 2026లో తమ తొలి ట్రోఫీని విజయవంతంగా డిఫెండ్ చేయాలనే సంకల్పంతో RCB బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీకి ముందున్న వారం రోజులను వృథా చేసుకోవద్దని తొటి ప్లేయర్లకు కోహ్లీ సూచించాడు. తొలి కప్ కోసం గత 2-3 ఏళ్లుగా ఎంతో కష్టపడ్డామని, ఇతర జట్ల నుంచి పోటీతో ఈ సారి టైటిల్ డిఫెండ్ చేయడం కష్టతరం కానుందని హెచ్చరించాడు. ఈ ఛాలెంజ్ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నానన్నాడు.
చెన్నై చెపాక్ స్టేడియంలో CSK రేపు ‘రోర్ 26’ పేరిట ఓ మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనుంది. మాథ్యూ హేడెన్, బద్రినాథ్, రైనా, మురళీ విజయ్ సహా ఫ్రాంచైజీ మాజీ ప్లేయర్లు ఈ సందర్భంగా మరోసారి ఒకే వేదికపై నిలవనున్నారు. ఈ ఈవెంట్‌లో AR రెహ్మాన్ లైవ్ పెర్ఫామెన్స్‌తో పాటు.. మాజీ ప్లేయర్లు, ప్రస్తుత జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా సేవలను కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. నడుము నొప్పితో ఆకాశ్ దీప్ కూడా IPL 2026కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి కనీసం 8 వారాల సమయం పడుతుందని ఓ BCCI అధికారి తెలిపారు. మరో స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నప్పటికీ శ్రీలంక క్రికెట్ బోర్డ్ పెట్టే ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే IPL ఆడగలడు.
IPL టోర్నీలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఇచ్చిన మాదిరే.. ఫీల్డింగ్, బౌండరీలతో ఆటపై ఇంపాక్ట్ చూపించే ప్లేయర్లకు MVP అవార్డ్ అందిస్తారు. గత 18 సీజన్లుగా ఆడుతున్న ధోనీ, కోహ్లీ, రోహిత్, మనీస్ పాండేలలో.. కోహ్లీ మాత్రమే 2016లో ఈ అవార్డ్ అందుకున్నాడు. ఇక సునీల్ నరైన్ అత్యధికంగా 3 సార్లు(2012, 18, 24) దీన్ని అందుకోగా.. వాట్సన్, రసెల్ తలో 2 సార్లు తీసుకున్నారు.
గాయాల నేపథ్యంలో ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితేనే IPL 2026 కోసం NOC ఇస్తామని ఆటగాళ్లకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది. హసరంగ(LSG), నువాన్ తుషారా(RCB), పతిరణ(KKR), ఈషాన్ మలింగ(SRH)కి టెస్ట్ ఫలితాల ఆధారంగా NOC ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అటు ఇప్పటికే ఈ టెస్ట్ పాస్ అయిన దుష్మంత చమీర(DC), పతుమ్ నిస్సాంక(DC), కమిందు మెండిస్(SRH)కు తాజాగా NOC జారీ చేసింది.
IPL 2026లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఆటగాళ్లలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒకడు. దీంతో వైభవ్‌పై అంచనాలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయని.. వాటితో పాటు మీడియాకు దూరంగా ఉండేలా చూసుకుంటానని RR కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. క్రీజులో ఉండే ఒత్తిడిని యశస్వీ జైస్వాల్‌కి వదిలేయమని వైభవ్‌కి చెప్తానని, తన ఆటను ఆస్వాదిస్తూ సహజంగా ఆడేలా ప్రోత్సహిస్తానని పరాగ్ పేర్కొన్నాడు.