గాయం కారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు పాట్ కమిన్స్(SRH), జోష్ హేజిల్‌వుడ్(RCB) ప్రారంభ IPL మ్యాచులకు దూరమైన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మిచెల్ స్టార్క్(DC) కూడా IPL ప్రారంభంలో కొన్ని మ్యాచులకు ఆడబోడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వర్క్ లోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరో ఆసీస్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
పాక్ ప్లేయర్ల ముంగిట తమ క్రికెట్ బోర్డ్(PCB) సాగిలపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్‌జాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇంత బలహీనంగా PCBని గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుత పాలక బోర్డ్ వల్ల ఏం కాదని విమర్శించాడు. కొత్త ప్లేయర్లను తీసుకొచ్చే అవకాశం ఉన్నా ప్రతిసారీ ఉన్న ప్లేయర్లతోనే ఏదో ట్రిక్ ప్లే చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
IPL ప్రారంభానికి ముంగిట టీమిండియా ప్లేయర్, RCB కెప్టెన్ రజత్ పాటీదార్ ఇంట సంతోషం వెల్లివిరిసింది. నిన్న అతని భార్య గుంజన్ పాటీదార్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అటు RCB కోచ్ దినేష్ కార్తీక్-దీపికా పల్లికల్ దంపతులకు కూడా నిన్నే ఆడబిడ్డ జన్మించింది. ఒకే రోజు(జూన్ 1) పుట్టిన దినేష్, రజత్ ఒకే రోజున(మార్చి 19) తండ్రులు అవ్వడం విశేషం.
ధోనీ, కోహ్లీ, రోహిత్, మనీష్ పాండే IPL – FAB 4గా కొనసాగుతున్నారు. తొలి సీజన్ 2008 నుంచి ఆడుతున్న ఈ నలుగురు.. మరో 8 రోజుల్లో ప్రారంభమయ్యే 19వ సీజన్ కోసం సిద్ధమవుతూ యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచారు. తొలి నుంచి కోహ్లీ RCB తరఫునే ఆడుతుండగా.. ధోనీ CSKతో పాటు గతంలో RPS కోసం ఆడాడు. రోహిత్ డెక్కన్ ఛార్జర్స్, MI కోసం ఆడగా.. పాండే(ఇప్పుడు KKR) 7 జట్ల తరఫున బరిలోకి దిగాడు.
T20 WC విజయం తర్వాత శివమ్ దూబే రైలులో ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి అదే పనిగా వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందిస్తూ.. ‘ట్రైన్ జర్నీ చేయడం గొప్ప విషయమా? నేనూ చాలా సార్లు చేశా. ఇతరులతో కలిసి అంతర్జాతీయ క్రికెటర్లు టీ తాగుతూ మమేకం కావడం ఎంత బాగుంటుంది? ఇలాంటి చిన్నచిన్న విషయాల్లోనే ఆనందం ఉంటుందని మర్చిపోతున్నాం’ అని అన్నాడు.
SRHకు మినహా మిగతా 9 జట్లకు భారత ప్లేయర్లే సారథిగా వ్యవహరిస్తున్నారు. అయితే కమిన్స్ వచ్చే వరకు జట్టు బాధ్యతలను ఇషాన్‌కు అప్పగించడంతో లిస్టులో SRH కూడా చేరింది. IPL 2019లోనూ ఇలా జరిగినా.. భువనేశ్వర్ ఒక్క మ్యాచులోనే SRHను నడిపించాడు. కానీ ఒకటి కంటే ఎక్కువ మ్యాచుల్లో అన్ని జట్లను నడిపించేది భారత ప్లేయర్లే కావడం 2026లోనే తొలిసారి.
అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతూ.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఆకలిగా అనిపించినప్పుడు, జంక్ ఫుడ్‌కు బదులుగా అరటిపండ్లు తినడం మంచి ఎంపిక. బరువు తగ్గాలనుకునే వారితో పాటు డైట్ ఫాలో అయ్యేవారు అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది.
ఐరీష్ సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ T20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. T20 WCలో ఐర్లాండ్ పేవల ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే వన్డే టీమ్ సారథిగా కొనసాగుతానని చెప్పాడు. దీంతో T20 టీమ్ పగ్గాలను త్వరలోనే మరొకరికి అప్పగిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. స్టిర్లింగ్ నేతృత్వంలో 48 T20లు ఆడిన ఐర్లాండ్.. 20 గెలిచింది.
T20 WC ఛాంపియన్ భారత్ జూలైలో 5 T20లు, 3 వన్డేల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సన్నాహంగా సూర్యసేన జూన్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆతిథ్య ఐరీష్ జట్టుతో 3 T20ల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అటు జూన్ 6-20 తేదీల్లో ఒక టెస్ట్, 3 వన్డేల కోసం అఫ్గన్.. భారత పర్యటనకు రానుంది.
తనకు టీ20 సారథ్య బాధ్యతలు దక్కడం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ లేడని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు రాహుల్ ద్రవిడ్, అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే తనకు టీ20 కెప్టెన్సీ దక్కిందని స్పష్టం చేశాడు.
స్పిన్నర్ మయాంక్ మార్కండేపై మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL-2026 సీజన్‌లో మయాంక్ రాణిస్తే ముంబై ఇండియన్స్‌కు తిరుగుండదని అన్నాడు. గత కొన్ని సీజన్లుగా ముంబైకి స్పిన్ బౌలింగ్ బలహీనతగా మారిందని, మయాంక్ ఆ లోటును తీర్చితే ఆ జట్టుకు ఏ సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు. అలాగే దీపక్ చాహర్ కూడా సత్తా చాటితే ముంబై బౌలింగ్ మరింత భీకరంగా మారుతుందన్నాడు.
టీమిండియా మాజీక్రికెటర్ అశ్విన్ భారత బౌలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బుమ్రా తర్వాత భారత జట్టు పరిస్థితేంటీ? బ్యాటింగ్ ఉన్నంత ఆకర్షణీయంగా బౌలింగ్ ఉండట్లేదు. దీంతో రాబోయే తరంలో పిల్లలు బౌలింగ్ ఎంచుకోకపోవచ్చు. బ్యాటర్లు కొట్టే సిక్స్‌లు, ఫోర్లు వారిని అలరిస్తాయి. బౌలింగ్‌తోనూ మనం టోర్నమెంట్లు, సిరీస్‌లు గెలవొచ్చని ఎవరు గ్రహిస్తారు?’ అని ప్రశ్నించాడు.
త్వరలో ఐపీఎల్ ప్రారంభంకానున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో వేరే బౌలర్ కోసం వెతికే పనిలో పడినట్లు CSK CEO విశ్వనాథన్ వెల్లడించాడు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలకమని, అతడు జట్టులో లేకపోవడం చాలా మైనస్ అని పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్ లేకపోవడంపై కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. ‘మేమెప్పుడూ సంజూ స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు. రోహిత్, విరాట్‌ను ఎవరైనా భర్తీ చేయగలరా? సంజూ విషయంలోనూ అంతే. ఆయన్ను ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఈ సీజన్‌లో మా దృష్టి అంతా అత్యుత్తమ ప్రణాళికతో బరిలోకి దిగడం, విజయంపైనే ఉంది. గతేడాది మేం అనుకొన్న విధంగా ఆడలేకపోయాం’ అని తెలిపాడు.