భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారీ ఊరట లభించింది. భరణంగా ధావన్ ఇచ్చిన దాదాపు రూ. 5.72 కోట్ల తిరిగి ఇచ్చేయాలని ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీని కోర్టు ఆదేశించింది. ప్రాపర్టీ సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.