గాయాల నేపథ్యంలో ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితేనే IPL 2026 కోసం NOC ఇస్తామని ఆటగాళ్లకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది. హసరంగ(LSG), నువాన్ తుషారా(RCB), పతిరణ(KKR), ఈషాన్ మలింగ(SRH)కి టెస్ట్ ఫలితాల ఆధారంగా NOC ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అటు ఇప్పటికే ఈ టెస్ట్ పాస్ అయిన దుష్మంత చమీర(DC), పతుమ్ నిస్సాంక(DC), కమిందు మెండిస్(SRH)కు తాజాగా NOC జారీ చేసింది.
IPL 2026లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఆటగాళ్లలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒకడు. దీంతో వైభవ్‌పై అంచనాలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయని.. వాటితో పాటు మీడియాకు దూరంగా ఉండేలా చూసుకుంటానని RR కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. క్రీజులో ఉండే ఒత్తిడిని యశస్వీ జైస్వాల్‌కి వదిలేయమని వైభవ్‌కి చెప్తానని, తన ఆటను ఆస్వాదిస్తూ సహజంగా ఆడేలా ప్రోత్సహిస్తానని పరాగ్ పేర్కొన్నాడు.
ఐర్లాండ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడనున్నట్లు BCCI ప్రకటించింది. బెల్‌ఫాస్ట్ మైదానంలో జూన్ 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకు భారత్ 2018, 2022, 2023 సంవత్సరాల్లో ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. కానీ, బెల్‌ఫాస్ట్‌లో 2007 తర్వాత ఆడటం ఇదే మొదటిసారి అవుతుందని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తీవ్రమైన గాయం కారణంగా తాను 7 కిలోల బరువు తగ్గినట్లు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. కోలుకునే క్రమంలో బరువును తిరిగి పొందడం, ఫిట్‌నెస్ సాధించడం చాలా కష్టమైన సవాలుగా మారిందన్నాడు. అయితే కష్టపడి ఆ దశను అధిగమించడం గర్వంగా ఉందని తెలిపారు.
RCB కోచింగ్ స్టాఫ్‌పై మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అక్కడ కేవలం ఆటగాళ్లను కాకుండా మ్యాచ్ విన్నర్లను తయారు చేస్తున్నారని కొనియాడాడు. అయితే, భారీ ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ కోసం దేవదత్ పడిక్కల్‌ను పక్కన పెడతారా? అనేది చూడాలన్నాడు. మార్చి 28న SRHతో జరిగే పోరులో RCB వ్యూహం ఎలా ఉంటుందో చూడాలంటూ వ్యాఖ్యానించాడు.
‘సూరత్ క్రికెట్ టీ20 లీగ్’లో గుజరాత్ బ్యాటర్ ఆర్య దేశాయ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 81 బంతుల్లోనే 193 పరుగులు చేసి టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో IPLలో క్రిస్ గేల్ (175*) పేరిట ఉన్న రికార్డును ఆర్య తిరగరాశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆర్య దేశాయ్ ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఈ ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియలో రూ.16,000 కోట్ల(1.7 బిలియన్ డాలర్లు)తో వచ్చిన భారీ బిడ్‌ను ఆ జట్టు యాజమాన్యం తిరస్కరించింది. ఇంత పెద్ద మొత్తాన్ని కాదనుకోవడంపై క్రీడా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఎక్కువ నిధులు ఆశించి రాజస్థాన్ రిస్క్ చేస్తోందని వారు విశ్లేషిస్తున్నారు.
ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. మరో 8 రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 20 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. బుమ్రా, సిరాజ్ వంటి పేసర్ల ఫామ్, ఫిట్‌నెస్‌ను పరిశీలించేందుకు సెలక్టర్లు నేరుగా మైదానానికే వెళ్లనున్నారు. హర్షిత్ రాణా గాయంతో దూరం కాగా.. మిగిలిన వారి ప్రదర్శనపై ఫోకస్ పెట్టారు.
IPL-202 త్వరలో ప్రారంభంకానున్న వేల టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే కూడా అభిషేక్ ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో ‘గేమ్ ఛేంజర్’ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ అభిషేక్‌కు టర్నింగ్ పాయింట్ కావాలి అన్నాడు.
టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్‌పై కాంగ్రెస్ కీలక నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సంజూ విషయంలో నేను మామయ్యాలా వ్యవహరించాలనుకుంటాను. అతడికి 14 ఏళ్లు ఉన్నప్పుడే నేను కలిశాను. మరో ధోని అవుతాడని ఊహించాను. కొన్నేళ్ల తర్వాత ఇదే మాటలను నా మిత్రుడు గంభీర్‌కు చెప్పినప్పుడు.. సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు అతడిలానే ఉండనిద్దాం అన్నాడు’ అని తెలిపారు.
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని BCCIకి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై BCCI స్పందిస్తూ.. తమ వద్దకు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించింది. అతడి పదవీకాలం ముగిసిన తర్వాత BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా నిర్ణయం తీసుకుంటారని BCCI అధికారులు తెలిపారు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ జట్టు 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (63*), డెవాన్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది.
వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్(WCA) ర్యాంకింగ్స్‌లో IPL మూడో స్థానంలో నిలిచింది. ప్లేయర్లకు సగటు జీతం, సకాలపు చెల్లింపులతో ముందే ఉన్న IPL.. సమస్యల పరిష్కారం, ప్లేయర్ల హక్కుల అంశాల్లో వెనకబడి ఉండటంతో 3వ స్థానానికే పరిమితమైంది. అటు ఇంగ్లండ్-ది హండ్రెడ్, సౌతాఫ్రికా-SA20 తొలి 2 స్థానాల్లో ఉండగా.. ఆస్ట్రేలియా-BBL, పాక్-PSL 4, 5 స్థానాల్లో నిలిచాయి.
IPL 2026లో సత్తా చాటాలని యువ ప్లేయర్లు ఆత్రుతగా ఉన్న వేళ.. పలువురు సీనియర్లకు ఇదే చివరి టోర్నీ కానుంది. లిస్టులో 44 ఏళ్ల ధోనీ(CSK) పేరే ముందుంది. ప్రతి ఏటా ఈ వార్త వినిపిస్తున్నా ఇప్పుడు పక్కా అని టాక్. 2012 నుంచీ KKRకే ఆడుతున్న నరైన్(37), అలాగే ఇషాంత్(37-GT) కూడా ఈ టోర్నీ తర్వాత ఆడబోరని తెలుస్తోంది. అటు రహానే(37-KKR), స్టార్క్(36-DC) ఇదే బాట పట్టనున్నారని సమాచారం