చివరిగా న్యూజిలాండ్‌పై JAN 18న వన్డే ఆడిన కోహ్లీ.. 20 ఓవర్ల IPL గేమ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇలా ఆట నుంచి బ్రేక్ తర్వాత వేరే ఫార్మాట్‌లో ఆడటం మిగతావారికి కష్టం కానీ కోహ్లీ రాణించగలడని మహ్మద్ కైఫ్ అన్నాడు. దూకుడుగా కాకుండా నిలకడగా ఆడుతున్నాడని.. ఇకపై ఆడినంత కాలం తన విమర్శకులకు తాను విరాట్ కోహ్లీ అని గుర్తుచేయాలని కింగ్ ఫిక్స్ అయ్యాడని కైఫ్ చెప్పుకొచ్చాడు.
పాక్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఇద్దరూ ఆట నుంచి బ్రేక్ తీసుకోవాలని పాక్ మాజీ కెప్టెన్ అజర్ ఆలీ సూచించాడు. బాబర్ 6 నెలలు, అఫ్రిది 3 నెలలు జట్టుకు దూరంగా ఉండాలని.. అప్పుడే ఫిట్‌నెస్, ఫామ్ పొందగలరని పేర్కొన్నాడు. కాగా T20 WC 2026లో బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 91 రన్స్ చేయగా.. అఫ్రిది 5 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు.
PSL 2026 నుంచి ఆసీస్ ప్లేయర్ జేక్ మెక్‌గుర్క్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ‘రావల్‌పిండిజ్’ (కొత్త) టీమ్ ధ్రువీకరించింది. కాగా IPL 2024 & 25లో ఢిల్లీకి ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్.. ఇటీవలి వేలంలో అమ్ముడుపోలేదు. అయినప్పటికీ గాయపడినవారి స్థానంలో IPL 2026లో ఆడే ఛాన్స్ లేకపోలేదు. ఇక చార్లెస్ జాన్సన్(WI) తప్పుకోవడంతో కరాచీ కింగ్స్ రీజా హెండ్రిక్స్(SA)ని తీసుకుంది.
SRH నిన్న ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తన ఓవర్‌లో అప్పటికే 21 రన్స్ చేసిన ఇషాన్‌ను చివరి బంతికి ఔట్ చేయగానే.. ఇక వెళ్లు అన్నట్లు జీషన్ అన్సారీ వేలు చూపించాడు. దీనికి ఇషాన్ నవ్వుతూనే స్పందించాడు. అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కొందరు.. కాదు, ఆట మధ్యలో సరదాగానే జీషన్ అలా చేశాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యర్థి బ్యాటర్లకు ఆందోళన కలిగించేలా KKR బౌలింగ్‌లో ఒకప్పటి వైవిధ్యం ఇప్పుడు లేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వరుణ్ చక్రవర్తి కొత్త దారులు వెతకాలని, నరైన్ వేగవంతమైన బంతులు వేయలేడని పేర్కొన్నాడు. వీళ్లపై భారీ షాట్లు ఆడేందుకు బ్యాటర్లు వెనకాడరని చెప్పాడు. హర్షిత్, ఆకాశ్ దూరమవడంతో మరింత బలహీనపడిన KKRకు హిట్టింగ్ ప్లేయర్లను ఎదుర్కోవడం పెద్ద సవాలేనని అన్నాడు.
కమిన్స్ వచ్చేవరకు IPL 2026లో SRHను ఇషాన్ నడిపించనున్న సంగతి తెలిసిందే. సారథిగా అతనికి మంచి రికార్డే ఉంది. కెప్టెన్‌గా 29 మ్యాచుల్లో 24 విజయాలు అందుకున్నాడు. SMAT 2025లో 11 మ్యాచులకు ఒక్కటే ఓడాడు. జట్టు భారం తనపై ఉన్నా బ్యాట్‌తో ఎక్కడా తగ్గకుండా 43.12 సగటుతో 7 సెంచరీలు చేశాడు. మరి అతని కెప్టెన్సీ స్టైల్ SRHకు పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
చెరో 5 IPL ట్రోఫీలు గెలిచిన MI, CSKలో గొప్ప జట్టు ఏదనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే కొత్త టాలెంట్‌ని వెలికితీసి, ప్రోత్సహించడంలో CSK కంటే MI ముందుంటుందని.. భారత క్రికెట్‌కి ఎందరో గొప్ప ప్లేయర్లను అందించచిన ఘనత ముంబైదే అని స్పష్టంచేశాడు. జట్టులో నలుగురు భారత కెప్టెన్లు ఉన్నప్పటికీ ఒక్కటిగా రాణించడం ముంబైకే సాధ్యమైందని గుర్తుచేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు, కెప్టెన్ ఇషాన్ 25 బంతుల్లోనే 72 పరుగులతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
గత సీజన్ ఫైనల్ గెలిచిన క్షణాలను విరాట్ కోహ్లీ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ‘కీలక వికెట్ పడినప్పుడు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నేను, బయట ఉన్న ఏబీ డివిలియర్స్ ఒకేలా సెలబ్రేట్ చేసుకున్నాం’ అని తెలిపాడు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB తొలిసారి కప్ ముద్దాడిన ఆ చారిత్రాత్మక క్షణం ఎప్పటికీ స్పెషల్ అంటూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
SRH ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. SRH-A జట్టు 253 పరుగులు చేయగా, SRH-B 282 పరుగులు సాధించింది. బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్‌తో మెరిశాడు. 4 ఓవర్లలో కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. IPL ముందు నితీష్ ఫామ్‌లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.
RRలోకి శాంసన్‌కి బదులు వేరొకరిని తీసుకోగలం కానీ, అతని స్థానాన్ని భర్తీ చేయలేమని ఆ టీమ్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. టీమ్ ఏదైనా రోహిత్, కోహ్లీ స్థానాలను ఎలా భర్తీ చేయలేమో.. సంజూ పరిస్థితీ అంతేనన్నాడు. సారథిగా విజయం కోసం ఎక్కడ ఎలా వ్యవహరించాలన్నదానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కాగా ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజూ CSKలో చేరిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ కోచ్‌గా తన 6 నెలల అనుభవం అత్యంత దారుణమని గ్యారీ కిర్‌స్టన్ ఆవేదన వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్ అతిగా జోక్యం చేసుకోవడం, కోచ్‌లకు స్వేచ్ఛ లేకపోవడం వల్లే తాను తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆసీస్ మాజీ పేసర్ గిలెస్పీ కూడా పీసీబీ తీరును తప్పుబడుతూ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ ప్లేయర్లు తిలక్, సూర్య మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం వైరలవుతోంది. IPLలో 3వ స్థానంలో ఆడుతున్నానా లేదా? అని తిలక్ అడగగా.. తనకు తెలియదని, తాను టీమ్ కెప్టెన్ కాదని సూర్య బదులిచ్చాడు. దీనిపై పాండ్యాను అడగమన్నాడు. కాగా రోహిత్ నుంచి MI పగ్గాలను హార్దిక్, భారత T20 జట్టు బాధ్యతలను సూర్య అందుకున్న సంగతి తెలిసిందే.
IPL 2026లో తమ తొలి ట్రోఫీని విజయవంతంగా డిఫెండ్ చేయాలనే సంకల్పంతో RCB బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీకి ముందున్న వారం రోజులను వృథా చేసుకోవద్దని తొటి ప్లేయర్లకు కోహ్లీ సూచించాడు. తొలి కప్ కోసం గత 2-3 ఏళ్లుగా ఎంతో కష్టపడ్డామని, ఇతర జట్ల నుంచి పోటీతో ఈ సారి టైటిల్ డిఫెండ్ చేయడం కష్టతరం కానుందని హెచ్చరించాడు. ఈ ఛాలెంజ్ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నానన్నాడు.
చెన్నై చెపాక్ స్టేడియంలో CSK రేపు ‘రోర్ 26’ పేరిట ఓ మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనుంది. మాథ్యూ హేడెన్, బద్రినాథ్, రైనా, మురళీ విజయ్ సహా ఫ్రాంచైజీ మాజీ ప్లేయర్లు ఈ సందర్భంగా మరోసారి ఒకే వేదికపై నిలవనున్నారు. ఈ ఈవెంట్‌లో AR రెహ్మాన్ లైవ్ పెర్ఫామెన్స్‌తో పాటు.. మాజీ ప్లేయర్లు, ప్రస్తుత జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనున్నాయి.