• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

భారత్ అండర్-19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో భారత్ అండర్-19 జట్టు తరపున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన విష...

December 7, 2024 / 07:34 AM IST

ACC కొత్త ఛైర్మన్‌గా షమ్మీ సిల్వా

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా శ్రీలంక ఆటగాడు షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత్‌కు చెందిన జై షా స్థానంలో షమ్మీ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మూడుసార్లు ACC అధ్యక్ష పదవిని చేసిన జై షా రాజీనామా చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని షమ్మీ సిల్వా ప్రకటనలో పేర్కొన్నాడు.

December 7, 2024 / 07:28 AM IST

నేటి నుంచి సీఎం కప్ పోటీలు

నిజామాబాద్: సీఎం కప్‌లో భాగంగా జిల్లాలో శనివారం నుంచి గ్రామస్థాయి క్రీడా పోటీలు ప్రారంభంకానున్నాయని డీవైఎస్‌వో ముత్తన్న ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్, ఫుట్ బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, యోగా విభాగాల్లో పోటీలుంటాయన్నారు. క్రీడాకారులు గ్రామాల్లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.

December 7, 2024 / 07:26 AM IST

జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా క్రీడాకారులు నేడు రిపోర్ట్ చేయాలి: కోచ్

KMR: ఉమ్మడి జిల్లాకు చెంది ఎంపికైన హాకీ క్రీడాకారులు శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని అండర్-14 హాకీ కోచ్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు ఒరిజినల్ తమ వెంట తెచ్చుకోవాలని చెప్పారు.

December 7, 2024 / 05:26 AM IST

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక

KMR: రాష్ట్రస్థాయిలో హైదరాబాదులో జరగనున్న క్రికెట్ పోటీలకు రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆముదా మణికంఠ ఎంపికయ్యారు. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన అండర్ 14 విభాగం క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అతడు పాల్గొననున్నాడు.

December 7, 2024 / 04:51 AM IST

మా నాన్న ఏడ్చిన రోజులు చూశా: నితీశ్ రెడ్డి

అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఇదంతా తన తండ్రి చేసిన త్యాగం వల్లేనని నితీశ్ వెల్లడించాడు. ‘నాకోసం మా నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. నేను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం. ఆర్థిక సమస్యల కారణంగా ఒకరోజు మా నాన్న ఏడవడం చూశా. మేం ఎదుర్కొన్న కష్టాలు, మా నాన్న త్యాగం ముందు నా...

December 6, 2024 / 10:32 PM IST

పృథ్వీ షా దేవుడిచ్చిన వరం: మాజీ క్రికెటర్

టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా 10 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అతని క్రికెట్ నైపుణ్యంపై ఎవరికీ సందేహం లేదని చెప్పాడు. పృథ్వీ షా దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చాడు. కానీ, అతనికి అతనే శత్రువు.. తిరిగి గాడిలో పడాలంటే ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించాడు.

December 6, 2024 / 09:31 PM IST

AUS vs IND: తొలి రోజు ముగిసిన ఆట

ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం లబుషేన్ (20*), మెక్‌స్వినీ (38*) క్రీజులో ఉన్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

December 6, 2024 / 06:08 PM IST

బుమ్రా మరో రికార్డు

భారత స్టార్ పేసర్ బుమ్రా టెస్టుల్లో మరో రికార్డు నెలకొల్పాడు. 2024లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అడిలైడ్ టెస్టులో బుమ్రా 50 వికెట్ల మార్క్ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో ఒకే ఏడాది 50 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా చేరాడు. కాగా, ఓ క్యాలెండర్ ఇయర్‌లో కపిల్ దేవ్ రెండు సార్లు 50+ వికెట్లు సాధించాడు. 1979లో 74 వికెట్లు, 1983లో 75 వికెట్లు పడగొట్టాడు. 2002లో జహీర్ ఖాన్...

December 6, 2024 / 05:26 PM IST

AUS vs IND: ఆచితూచి ఆడుతున్న ఆసీస్

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆచితూచీ బ్యాటింగ్ చేస్తోంది. 24 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. లబుషేన్ 13, మెక్‌స్వినీ 27 పరుగులు చేశారు. ఇక భారత్ స్టార్ పేసర్ బుమ్రాకు వికెట్ దక్కింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

December 6, 2024 / 04:36 PM IST

ఆసియా కప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ 21.4 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (67) అర్ధశతకం, ఆయుష్ మాత్రే (34) రాణించారు. లంక బౌలర్లు విహాస్, విరన్, ప్రవీణ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 173 పరుగులకు ఆలౌట్ అయింది.

December 6, 2024 / 03:57 PM IST

BREAKING: భారత్‌ ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి 42, కేఎల్ రాహుల్‌ 37, గిల్ 31 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ 6 వికెట్లు పడగొట్టాడు. బోలాండ్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

December 6, 2024 / 02:23 PM IST

U19 IND Vs SL: భారత్‌ లక్ష్యం 174

అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక 173 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అబెయ్‌సింఘే 69, షరుజన్‌ 42 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చేతన్‌ శర్మ 3 వికెట్లు.. కిరణ్‌ చొర్మాలే, ఆయుష్‌ మాత్రే చెరో 2 వికెట్లు.. యుధజిత్‌ గుహ, హార్దిక్‌ రాజ్‌ చెరో వికెట్...

December 6, 2024 / 01:53 PM IST

రోహిత్ శర్మకు కలిసిరాని మిడిల్ ఆర్డర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మిడిల్ ఆర్డర్ అస్సలు కలిసిరావడం లేదు. AUSతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ 6వ స్థానంలో బరిలోకి దిగాడు. రెగ్యూలర్‌గా ఓపెనింగ్ స్థానంలో వచ్చే హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో వచ్చి కేవలం 3 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. కాగా, రోహిత్‌కు మిడిల్ ఆర్డర్‌లో గొప్ప రికార్డులేమి లేకపోగా.. ఓపెనర్‌గా మారాకే టెస్టుల్లో రాణిస్తున్నాడు.

December 6, 2024 / 01:43 PM IST

IND vs AUS: జైశ్వాల్ చెత్త రికార్డ్

ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఓ చెత్త రికార్డును జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు మ్యాచులో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

December 6, 2024 / 12:25 PM IST