భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లోనూ ఇదే రిథమ్ కొనసాగించాలని సూచించాడు. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా, అందరూ కలిసికట్టుగా రాణించారని అభినందించాడు.