SRH కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే భారత్‌కు చేరుకుని జట్టుతో కలిశాడు. అయితే, గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో IPL 2026 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం కమిన్స్ SRH మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఏప్రిల్ చివరిలో కమిన్స్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
BCCI తాజాగా 2026-27 హోం సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే జట్లతో మూడు మ్యాచ్‌ల చొప్పున మొత్తం 9 వన్డేల్లో తలపడనుంది. 2027 ODI WCను దృష్టిలో ఉంచుకుని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేలా బీసీసీఐ ఈ ప్రణాళికను సిద్ధం చేసింది.
LSG కెప్టెన్ రిషభ్ పంత్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని డుప్లెసిస్ సూచించాడు. ఆ స్థానం పంత్‌కు సరిగ్గా సరిపోతుందన్నాడు. పంత్ అనవసరమైన రిస్క్ తీసుకోకుండా, నిలకడగా బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. పంత్‌తో పాటు మార్‌క్రమ్, మార్ష్, పూరన్ వంటి ఆటగాళ్లతో LSG బ్యాటింగ్ బలంగా ఉందని కొనియాడాడు.
IPL-2026 ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు పేసర్ యర్రా పృథ్వీరాజ్ గాయం కారణంగా మెగాటోర్నీకి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియాను జట్టులోకి తీసుకుంది. కాగా, APకి చెందిన పృథ్వీరాజ్‌ను గతేడాది జరిగిన వేలంలో రూ. 30 లక్షలకు GT సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
IPL ట్రేడ్ డీల్‌లో సంజూ శాంసన్ RR నుంచి CSKలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో రాజస్థాన్ నుంచి చెన్నైకి వచ్చిన రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అజింక్యా రహానే ట్రోఫీ గెలిచారు. వాట్సన్(2018), ఉతప్ప(2021), రహానే(2023) అయితే CSK తరఫున తొలి టోర్నీలోనే కప్ అందుకున్నారు. ఈ క్రమంలో సంజూ కూడా ఈ సారి కప్ గెలుస్తాడని CSK ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
బెంగళూరు వేదికగా IPL 19వ సీజన్ ఓపెనర్‌లో RCB, SRH తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముందు టోర్నీ ప్రారంభ వేడుకలను BCCI రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత సీజన్ ఫైనల్ తర్వాత మరణించిన 11 మందికి గౌరవ సూచికగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సీజన్ ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.
మరో రెండు రోజుల్లో IPL 2026 ప్రారంభం కానుండగా.. SRH రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఆడతాడా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై స్పందించిన కమిన్స్.. సీజన్ సెకండ్ ఆఫ్ నాటికి జట్టులో చేరతానని, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో SRH ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూకి ముందు IPLలో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్(POTF)’ అందుకోవడం ముగ్గురికే సాధ్యమైంది. ఈ లిస్టులో తొలి ప్లేయర్ మన్విందర్ బిస్లా(KKR). 2012లోనే POTF అందుకున్న బిస్లా.. ఇప్పటికీ దేశానికి ఆడలేకపోయాడు. అటు 2014లో ఈ ఘనత సాధించిన మనీష్ పాండే(KKR).. 2015లో టీమిండియాలో చేరాడు. ఇక 2017లో POTF పొందిన కృనాల్ పాండ్యా(MI) కూడా 2018లో BCCI పిలుపు అందుకున్నాడు.
స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్న రహానే.. కోహ్లీని చూసి నేర్చుకోవాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. గతంలో కోహ్లీకీ ఇదే పరిస్థితి అని.. అయితే తన ఆటపై వచ్చిన విమర్శలకు అతను ఆటతోనే సమాధానమిచ్చాడని గుర్తుచేశాడు. స్పిన్నర్లపై బలంగా, నేరుగా కొట్టే షాట్లపై రహానే దృష్టి పెట్టాలన్నాడు. గతేడాది రహానే మంచి అరంభాలు పొందినా.. పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడని పేర్కొన్నాడు.
IPL 2026 ప్రారంభానికి ముందు అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్, యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అతను తరచూ రిల్స్ చేస్తూ తిరుగుతున్నాడని, ఇది అతని పని కాదన్నారు. యువరాజ్‌లా కావాలంటే మరో యుగం పడుతుందని. యువ క్రికటర్లు క్రమశిక్షణ అలవరచుకోవాలని హితవు పలికారు. ప్రతి బంతినీ బాదాలని కాకుండా డిఫెన్స్ కూడా ఆడాలని అభిషేక్‌కి సూచించారు.
సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) U20 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇవాళ భారత్, పాక్ తలపడనున్నాయి. సా.4:15 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇవాళే తమ తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. పాక్, బంగ్లాతో కలిసి ‘గ్రూప్-B’లో ఉంది. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉంటుంది. అటు బంగ్లా చేతిలో తొలి పోరు ఓడిన పాక్.. ఇవాళ ఎలా ఆడుతుందో చూడాలి.
RCB ₹16,500Crకు అమ్ముడుపోవడంపై ఆ ఫ్రాంచైజీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా హర్షం వ్యక్తంచేశారు. 2008లో RCBని తాను ₹450Crకు తీసుకున్నప్పుడు అంతా విమర్శించి, నవ్వారని గుర్తుచేసుకున్నారు. యువ కోహ్లీని తీసుకోవడం వంటి మరపురాని జ్ఙాపకాలతో RCB తన DNAలో భాగంగా ఉండిపోతుందన్నారు. మాల్యా 2008లో యూనైటెడ్ స్పిరిట్స్(USL) ద్వారా RCBని కొనగా.. 2012లో RCB సహా USLను డియాజియో సొంతంచేసుకుంది.
మహ్మద్ షమీ తనకు అన్నలాంటివాడని భారత పేసర్ ముకేశ్ కుమార్ పేర్కొన్నాడు. బెంగాల్ తరఫున ఇద్దరం కలిసి ఆడామని.. అనుకున్నట్లుగా ఆడలేకపోయినప్పుడు షమీ వద్దకు వెళ్లి సలహా తీసుకుంటానని చెప్పాడు. షమీ చాలా అండగా ఉంటాడని, అతని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ముకేష్ చెప్పుకొచ్చాడు. కాగా భారత జట్టులోకి రీఎంట్రీ కోసం ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఎంతో కాలంగా ఎదురుచేస్తున్నారు.
వైట్ బాల్ క్రికెట్‌లో MS ధోనీ తన కంటే గొప్ప కెప్టెన్ అని దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ధోనీ భారత్‌కు 2011 వన్డే వరల్డ్ కప్ అందించాడని.. తాను జట్టును 2003 టోర్నీలో రన్నరప్‌గా మాత్రమే నిలపగలిగానని పేర్కొన్నాడు. తమ కాలంలో T20 WC లేదని, జార్ఖండ్ నుంచి తొలి క్రికెటర్ అయిన ధోనీ.. దిగ్గజంగా ఎదగడం చూసి గర్వపడుతున్నట్లు దాదా తెలిపాడు.