• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

వామ్మో.. ఒక్క క్యాప్ ధర రూ.2.63 కోట్లా!

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌కు వేలంలో భారీ ధర పలికింది. 1947-48లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ సుమారు రూ.2.63 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా, స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు అదే చివరి సిరీస్‌. ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా 715 పరుగులు సాధించాడు. ప్రస్తుతం R...

December 4, 2024 / 09:30 PM IST

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌.. ఎనిమిదో గేమ్‌ డ్రా

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌, డిఫెండింగ్ ఛాంపియన్‌ డింగ్ లిరెన్ మధ్య ఎనిమిదో గేమ్ డ్రా అయింది. ప్రపంచ టైటిల్‌ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఎనిమిది గేమ్‌లు జరగ్గా ఆరు డ్రా అయ్యాయి. కాగా.. ఎనిమిది రౌండ్‌లు పూర్తయ్యే సరికి 4-4 పాయింట్లతో గుకేశ్, లిరెన్‌ సమానంగా ఉన్నారు.

December 4, 2024 / 08:49 PM IST

HYD: ట్యాంక్ బండ్ వెళ్తున్నారా.. ఇక ఫుల్ ఎంజాయ్!

HYD: హుస్సేన్సాగర్ వెళ్లేవారు ఇక ఫుల్ ఎంజాయ్ చేసేయొచ్చు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్‌ను మంత్రి జూపల్లి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. హుస్సేన్సాగర్లో జెట్ స్కీపై సరదాగా విహరించారు. కొత్తగా వాటర్ రోలర్, జెట్ అటాక్, కాయక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

December 4, 2024 / 07:31 PM IST

టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం

టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఆసీస్‌తో రెండో టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వందలాది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలో ఆసీస్ అభిమానులు భారత ఆటగాళ్లను ఎగతాళి చేశారు. దీంతో ఈ టూర్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించొద్దని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

December 4, 2024 / 06:42 PM IST

జేఎన్టీయూ యూనివర్సిటీలో వాలీబాల్ జట్ల ఎంపిక

HYD: JNTU యూనివర్సిటీలో బుధవారం సౌత్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. సెక్రెటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ దిలీప్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేరళలో ఈ సౌత్ ఇంటర్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయని వారు తెలిపారు.

December 4, 2024 / 06:24 PM IST

బీసీసీఐ కార్యదర్శి రేసులో ముగ్గురు!

ఇటీవల ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి  ఖాళీ అయింది. తదుపరి బీసీసీఐ కార్యదర్శిగా ఎవరవుతారని క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనిల్ పటేల్(గుజరాత్), ప్రస్తుత బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా, రోహన్ జైట్లీ(ఢిల్లీ) ఈ పదవి రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

December 4, 2024 / 04:20 PM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌‌ను తాజాగా విడుదల చేసింది. ఏ జాబితాలో టీమిండియా ఓపెనర్‌ జైస్వాల్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌పై 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. ఈ జాబితాలో రిషబ్ పంత్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

December 4, 2024 / 03:55 PM IST

అండర్ 19: సెమీస్‌కు చేరిన టీమిండియా

అండర్-19 ఆసియా కప్‌ మ్యాచ్‌లో టీమిండియా సెమీస్‌కు చేరింది. UAEతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన UAE 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో ఛేదించింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (76*; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఈసారి మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.

December 4, 2024 / 03:21 PM IST

‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తానో తెలుసు’

డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, రోహిత్ శర్మ అందుబాటులోకి రావటంతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ ఓపెనర్‌గా వస్తాడా? లేదా మిడిలార్డర్‌లో దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో KL రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. జట్టును గెలిపించేందుకు తన వంతు కృ...

December 4, 2024 / 01:21 PM IST

అడిలైడ్ టెస్టు.. పిచ్‌పై 6 మిల్లీమీటర్ల గడ్డి

అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ఆసీస్, భారత్ మధ్య రెండో (పింక్ బాల్) టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో పిచ్‌పై ఆరు మిల్లీమీటర్ల గడ్డిని ఉపయోగిస్తామని పిచ్‌ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ పేర్కొన్నాడు. కొత్త బంతితో ఫ్లడ్‌ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుందని డామియన్ హగ్ వెల్లడించాడు.

December 4, 2024 / 01:05 PM IST

షాకు మాజీ క్రికెటర్ల హెచ్చరిక

యువ క్రికెటర్ పృథ్వీ షా వరుస వైఫల్యాలతో తన కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఫిట్‌నెస్‌లేమితో ముంబయి రంజీ జట్టులో చోటు కోల్పోగా.. IPL మెగా వేలంలోనూ అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. షా ఆటతీరు ఇలానే ఉంటే మరో సచిన్ ఏమో గానీ మరో కాంబ్లీగా మిగిలిపోతాడని మాజీ క్రికెటర్లు హెచ్...

December 4, 2024 / 12:36 PM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. రంగంలోకి జైషా..!

వచ్చే ఏడు పాకిస్థాన్‌లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అనేక సంకోచాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు జరిగే మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది. కానీ ఎక్కువ రెవెన్యూను తమకే ఇవ్వాలని కండీషన్ పెట్టింది. ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ అంశంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చర్చించేందుకు డిసెంబర్ 5 వర్చువల్ బోర్డ్ మీటింగ్‌కు పిలుపుని...

December 4, 2024 / 12:20 PM IST

క్రికెట్‌ వదిలేసి, పిల్లల్ని చూసుకోవాలన్నారు: మిథాలీ

మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన పెళ్లిచూపుల్లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంది. ‘క్రికెట్‌లో రానిస్తున్నప్పుడు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. వాటిలో కొన్ని పెళ్లిచూపులకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. అప్పుడు అబ్బాయిలు పెళ్లి తరువాత పరిస్థితుల గురించి మాట్లాడేవారు. ఎంత మంది పిల్లలు కావాలని అడిగితే ఇబ్బంది పడ్డాను. కొందరు కెప్టెన్‌గా ఉన్న నన్ను క్రికెట్ మానేసి పిల్లల్ని చూసుకోమన్నారు&rs...

December 4, 2024 / 12:00 PM IST

డబ్ల్యూటీసీలో న్యూజిలాండ్‌కు భారీ షాక్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో న్యూజిలాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో మందకోడిగా బౌలింగ్ వేసినందుకు జరిమానాగా ఆ జట్టుకు ఐసీసీ మూడు పాయింట్ల కోత విధించింది. దీంతో కివీస్ జట్టు డబ్ల్యూటీసీ ర్యాంకింగ్ టేబుల్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. కాగా 61.11 శాతం పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది.

December 4, 2024 / 11:28 AM IST

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మాటల్లేవని.. తామిద్దరం స్నేహితులం కాదని తెలిపాడు. అతడితో మాట్లాడి పదేళ్లు దాటుతోందని చెప్పాడు. IPLలో 2018-20 మధ్య CSK తరపున ఆడినప్పుడు కూడా మైదానంలోనే అది కూడా పరిమితంగానే మాట్లాడుకున్నట్లు వెల్లడించాడు.

December 4, 2024 / 10:47 AM IST