అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా సెమీస్‌కు చేరింది. UAEతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన UAE 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో ఛేదించింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (76*; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఈసారి మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.