డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, రోహిత్ శర్మ అందుబాటులోకి రావటంతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ ఓపెనర్‌గా వస్తాడా? లేదా మిడిలార్డర్లో దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో KL రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. జట్టును గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు.