మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన పెళ్లిచూపుల్లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంది. ‘క్రికెట్లో రానిస్తున్నప్పుడు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. వాటిలో కొన్ని పెళ్లిచూపులకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. అప్పుడు అబ్బాయిలు పెళ్లి తరువాత పరిస్థితుల గురించి మాట్లాడేవారు. ఎంత మంది పిల్లలు కావాలని అడిగితే ఇబ్బంది పడ్డాను. కొందరు కెప్టెన్గా ఉన్న నన్ను క్రికెట్ మానేసి పిల్లల్ని చూసుకోమన్నారు’ అని వెల్లడించింది.