వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో మందకోడిగా బౌలింగ్ వేసినందుకు జరిమానాగా ఆ జట్టుకు ఐసీసీ మూడు పాయింట్ల కోత విధించింది. దీంతో కివీస్ జట్టు డబ్ల్యూటీసీ ర్యాంకింగ్ టేబుల్లో ఐదో స్థానానికి పడిపోయింది. కాగా 61.11 శాతం పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది.