IPL 2026లో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 128 పరుగులు చేసింది. విజయ్‌కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో (13.6) ఫిలిప్స్ (25) మార్కో యాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం జోస్ బట్లర్ (38*), వాషింగ్టన్ సుందర్ (7*) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోర్ 128/3గా ఉంది.
IPL 2026లో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ 2 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 84 పరుగులు చేసింది. 9.3వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (39) ఔటయ్యాడు. జోస్ బట్లర్ (26*), గ్లెన్ ఫిలిప్స్ (1*)లు ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తన తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగుల వద్ద మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో (3.4) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (13) వెనుదిరిగాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోర్ 54/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో గిల్ (28*), జోస్ బట్లర్ (11*) ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో వచ్చే నెల జరగనున్న వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టును కివీస్ ప్రకటించింది.కివీస్ జట్టు: టామ్ లాథమ్ (C), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, క్లార్క్‌సన్, డేన్ క్లీవర్, ఫాక్స్‌క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
IPL 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడుతోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి గిల్‌పైనే అందరి దృష్టి ఉంది. భారత టీ20 జట్టులో లేని ఈ ఇద్దరు ప్లేయర్లు.. IPLలో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. టీ20 ప్రపంచకప్‌లో ఈ స్టార్ బ్యాటర్లకు భారత జట్టులో చోటుదక్కని విషయం తెలిసిందే.
CSKతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన అనంతరం రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 13 ఏళ్ల పాటు తాను ప్రాతినిధ్యం వహించిన జట్టుకు వ్యతిరేకంగా ఆడటం వింతగా అనిపించిందని అన్నాడు. అలాగే, CSK నుంచి వెళ్లిపోయిన తర్వాత ధోనీతో మాట్లాడలేదని తెలిపాడు. ఇప్పుడు తాము మాట్లాడుకోలేదు కానీ.. కలిసినప్పుడల్లా అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పుకొచ్చాడు.
IPL 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గత సీజన్‌లో టేబుల్ టాప్ 3లో నిలిచిన ఈ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరగనుంది. ఇరుజట్లకు ఇది సీజన్ తొలి మ్యాచ్ కావడంతో గెలుపుతో శుభారంభం చేయాలని భావిస్తున్నాయి.
IPL మ్యాచుల బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జాన్ విలియమ్ మృతిచెందాడు. మార్చి 29న మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబైలోని ఓ హోటల్‌లో తన గదికి వెళ్లిన జాన్.. రిసెప్షన్ నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా స్పందించకపోవడంతో ఎమర్జెన్సీ కీతో సిబ్బంది గదిని తెరిచి చూశారు. అప్పటికే జాన్ మృతిచెందాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PSL ప్రారంభ మ్యాచ్‌కు పంజాబ్ సీఎం మరియం హాజరుకావడాన్ని విమర్శిస్తూ నసీమ్ షా SMలో పోస్టు పెట్టాడు. దీనిపై పీసీబీ 20 మిలియన్ల పాకిస్తాన్ రూపాయలను జరిమానా విధించింది. PCB అతడిపై రెండేళ్ల నిషేధం విధించాలని భావించగా మోసిన్ PCB ఛైర్మన్ నఖ్వీ అడ్డుపడినట్లు తెలుస్తోంది. అతడి భవిష్యత్తు నాశనం అవుతుందనే ఉద్దేశంతో నక్వీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ క్రికెటర్ బసిత్ అలీ తెలిపాడు.
పాకిస్తాన్ ప్లేయర్ షహీన్ అఫ్రిది వివాదంలో నిలిచాడు. PSLలో అతడు సహచర క్రికెటర్ సికందర్ రజాతో కలిసి టీమ్ హోటల్స్‌లో ఉంటున్నాడు. అయితే, భద్రతా ప్రోటోకాల్స్‌ను వీరిద్దరూ ఉల్లంఘించినట్లు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు ఆరోపించారు. దీంతో అఫ్రిదిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ PSL మేనేజ్‌మెంట్ 10 లక్షల పాకిస్తాన్ రూపాయలను జరిమానా విధించింది.
IPL 2026 రసవత్తరంగా సాగుతోంది. జరిగిన 3 మ్యాచ్‌లలో CSK మినహా.. మిగతా 5 జట్ల బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఈ 6 ఇన్నింగ్స్‌ల్లోనే 1103 రన్స్, 61 సిక్సర్లు నమోదయ్యాయి. అయితే బ్యాటర్లు ఎంత దూకుడుగా ఆడుతున్నా.. ఆట ముగిశాక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ మాత్రం బౌలర్లకే సొంతమయ్యింది. SRHపై డఫ్పీ(RCB), KKRపై శార్దూల్(MI), CSKపై బర్గర్(RR) POTM అవార్డ్ అందుకున్నారు.
IPL 2026 లీగ్ దశలో తమ 14 మ్యాచ్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ ఆడతాడని RR కెప్టెన్ రియాన్ పరాగ్ స్పష్టంచేశాడు. CSKతో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఆటలో ఏం జరిగినా, మీడియాలో ఏం వస్తున్నా నువ్వు అన్ని మ్యాచుల్లో ఆడతావ్’ అని వైభవ్‌కూ చెప్పినట్లు తెలిపాడు. వైభవ్‌కి బ్యాటింగ్ ఇష్టమని, ఆడేందుకు మరిన్ని అవకాశాలు ఇస్తేనే భారీ ఇన్నింగ్స్ ఆడగలడని పరాగ్ పేర్కొన్నాడు.
ఈ నెల 27న తన 15వ పుట్టిన రోజు వేడుకను చేసుకోకుండానే నిద్రపోయినట్లు RR యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. ‘ప్రత్యేకంగా ఏం చేసుకోలేదు. నా కోసం కేక్ కటింగ్‌కు ఏర్పాటు చేశారు. కానీ ముఖంపై కేక్ పూస్తారని త్వరగా నిద్రపోయా’ అని చెప్పాడు. కాగా CSKతో నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(52) చేసి జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు.