టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 26న జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. అయితే, భారత బౌలర్లు ముగ్గురిపై దృష్టి పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ని త్వరగా ఔట్ చేస్తే జింబాబ్వేపై ఒత్తిడి పెంచడం ఖాయం. మరో ఓపెనర్ మరుమానితో పాటు కెప్టెన్ సికందర్ రాజ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ముగ్గురిని కట్టడి చేస్తే చాలని విశ్లేషకులు సూచించారు.