టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెనెట్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్లో మూడు మ్యాచుల్లో కలిపి బెనెట్ 175 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకపై హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, ఇతర జట్లలోని ఓపెనర్లు ఒక్కసారైనా పెవిలియన్కు చేరారు. కానీ, బెనెట్ ఒక్కసారి కూడా ఔట్ అవ్వలేదు.