• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

HCAపై TCA సంచలన ఫిర్యాదు

TG: HCAలో జరుగుతున్న సెలక్షన్లపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) ఫిర్యాదు చేసింది. సీఐడీ, డీజీపీ, రాచకొండ కమిషనర్‌కు ఈ ఫిర్యాదును అందజేశారు. గ్రామీణ, జిల్లా స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదని TCA ఆరోపించింది. క్రికెటర్ల తల్లిదండ్రులతో కలిసి ఆధారాలతో పాటు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకుని టాలెంట్ లేనివారికి అవకాశం ఇస్తున్నారని TCA ఫిర్యాదులో పేర్కొంది.

November 10, 2025 / 02:36 AM IST

షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో భారత్‌కు రజతం

ఈజిప్ట్‌లోని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌ పోటీల్లో భారత యువ షూటర్ అనీష్ భన్వాలా రజతంతో మెరిశాడు. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ విజయంపై భారత షూటింగ్ సంఘం స్పందిస్తూ.. అనీష్ విజయం దేశానికి గర్వకారణం అని పేర్కొంది.

November 9, 2025 / 08:33 PM IST

సౌతాఫ్రికా ‘A’ విజయం.. సిరీస్ సమం

సౌతాఫ్రికా ‘A’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘A’ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ‘A’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 255, రెండో ఇన్నింగ్స్‌లో 382/7D పరుగులు చేసింది. సౌతాఫ్రికా-A తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 417/5 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1...

November 9, 2025 / 05:42 PM IST

8 బంతుల్లో 8 సిక్సర్లు

రంజీ ట్రోఫీలో మేఘాలయ జట్టుకు చెందిన యువ బ్యాటర్ ఆకాశ్ కుమార్ చౌదరి చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశ్ వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదడం మరో విశేషం.

November 9, 2025 / 04:36 PM IST

హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీ విజేతగా పాక్

హాంకాంగ్ సిక్సర్స్ టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. కువైట్‌తో జరిగిన ఫైనల్‌లో పాక్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 135/6 స్కోరు నమోదు చేయగా, లక్ష్యఛేదనలో కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 92/6 పరుగులకే పరిమితమైంది. దీంతో, పాక్ హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీ ఛాంపియన్‌గా అవతరించింది.

November 9, 2025 / 02:50 PM IST

IPL-2026: బిగ్ అప్‌డేట్

IPL 2026 సీజన్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సీజన్‌కు ముందు మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో IPL ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ఈనెల 15వ తేదీలోపు IPL పాలక మండలికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆటగాళ్ల జాబితాను 15వ తేదీన అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

November 9, 2025 / 02:30 PM IST

అభిషేక్‌కు మాజీ ఆల్‌రౌండర్ వార్నింగ్

టీమిండియాకు అభిషేక్ శర్మ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌కు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్ ఇచ్చాడు. దూకుడుకూ ఓ హద్దు ఉండాలని తెలిపాడు. ప్రతి బంతిని ముందుకొచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి బౌలర్లు దానిపై దృష్టి పెట్టి బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించాడు. ప్రపంచకప్ సమయంలో దూకుడుగా ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.

November 9, 2025 / 01:16 PM IST

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..!

టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపచంకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హర్షా భోగ్లే అంచనా వేశాడు. అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, బుమ్రాలకు అవకాశం దక్కింది.

November 9, 2025 / 01:06 PM IST

ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్‌

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 149 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో తొలి క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

November 9, 2025 / 11:07 AM IST

అతడంటే ప్రత్యర్థులకు హ’ఢల్’

టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడంలోనూ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఏడు మ్యాచుల్లో ఏకంగా 200 స్ట్రైక్‌రేట్‌తో 314 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే అభిషేక్ టీమిండియాకు కీలక బ్యాటర్‌గా.. ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. అభిషేక్ ఓ 6 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే 60 నుంచి 80 పరుగులు చేసేస్తాడని బౌలర్లు బెంబేలెత్తుతున్నారు.

November 8, 2025 / 09:00 PM IST

అమితా బచ్చన్ షోలో క్రికెట్‌పై రూ.7.50 లక్షల ప్రశ్న

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 17వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా ఈ ‘షో’లో భాగంగా క్రికెట్‌కు సంబంధించి ఓ ప్రశ్న కంటెస్టెంట్‌కు ఎదురైంది. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో ఎవరి క్యాచ్ పట్టి.. ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు? అని రూ.7.50 లక్షల ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి.

November 8, 2025 / 06:35 PM IST

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా అభిషేక్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో మిగిలిన మూడు మ్యాచుల్లో అభిషేక్.. 163 పరుగులు చేశాడు.

November 8, 2025 / 05:52 PM IST

సూర్యను ఆటపట్టించిన బుమ్రా

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా టాస్ ఓడింది. దీనిపై స్టార్ పేసర్ బుమ్రా సరదాగా స్పందించాడు. మళ్లీ ఓడిపోయావా? అంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను బుమ్రా ఆటపట్టించాడు. దీంతో సూర్య నవ్వుతూ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నట్లు చేతితో సైగ చేసి చూపించాడు.

November 8, 2025 / 04:45 PM IST

ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికా-Aతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ జురెల్ (127*) సెంచరీతో చెలరేగాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ 132* పరుగులు సాధించాడు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 382-7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.

November 8, 2025 / 04:26 PM IST

BREAKING: ఐదో టీ20 రద్దు

గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో టీమిండియా ఇన్నింగ్స్‌లో 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. కాగా, ఐదు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. గత 17 ఏళ్లలో ఆస్ట్రేలియాలో టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోలేదు. 

November 8, 2025 / 04:22 PM IST