T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు మరోసారి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు T20 WC చరిత్రలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా, భారత్ 5 సార్లు విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2024 ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 22న జరిగే మ్యాచ్లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.