T20 WCలో ఈరోజు ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉందని, ఆ జట్టును ఓడించడానికి తమకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పసికూన ఒమన్, ఆస్ట్రేలియాను ఓడిస్తామనడం.. ఆ జట్టుకు సవాల్ విసిరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.