• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

57 పరుగులకే 6 వికెట్లు డౌన్

RRతో జరుగుతున్న మ్యాచ్‌లో CSK పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన CSKను రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కేవలం 8.0 ఓవర్లలోనే 57 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి CSK పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ రుతురాజ్(6), సంజూ శాంసన్(6) నిరాశపరిచారు. జడేజా, నాండ్రే బర్ఘర్ చెరో రెండు వికెట్లు, ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.

March 30, 2026 / 08:19 PM IST

కష్టాల్లో CSK.. 3 వికెట్లు డౌన్

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న పోరులో CSK ఆదిలోనే భారీ దెబ్బ పడింది. కేవలం 3 ఓవర్లు ముగిసే సమయానికే 3 కీలక వికెట్లు కోల్పోయి కేవలం 19 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లు దాటికి CSK బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మరి ఈ కష్టాల్లోంచి జట్టును గట్టెక్కించే ప్లేయర్ ఎవరో వేచి చూడాలి.

March 30, 2026 / 07:58 PM IST

RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్

IPL 2026 సీజన్‌లో భాగంగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RR టాస్ గెలిచింది. కెప్టెన్ రియాన్ పరాగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని CSKను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గౌహతి వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సంజూ, వైభవ్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు.

March 30, 2026 / 07:05 PM IST

బౌలింగ్ చేయని గ్రీన్.. స్పందించిన ఆస్ట్రేలియా

MIతో జరిగిన మ్యాచ్‌లో KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. కెప్టెన్ రహానె కూడా ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా(CA)నే అడగాలని సూచించాడు. ఈ నేపథ్యంలో CA స్పందించింది. గ్రీన్‌కు వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్నాడని.. 10-12 రోజుల్లో బౌలింగ్ చేసే సామర్థ్యం కోసం కష్టపడుతున్నాడని తెలిపింది.

March 30, 2026 / 05:49 PM IST

రోహిత్ 2.O రెడీ..: అనిల్ కుంబ్లే

కోల్‌కతాపై రోహిత్ శర్మ విధ్వంసక ఆట తీరును చూస్తుంటే ‘రోహిత్ 2.O’ సిద్ధమైనట్లు కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. నరైన్, వరుణ్ వంటి స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు. KKR తమ బౌలింగ్ వనరులను సరిగ్గా వాడుకోలేదని, ముఖ్యంగా పవర్‌ప్లేలో నరైన్‌ను ఆలస్యంగా దించడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని వివరించాడు.

March 30, 2026 / 04:50 PM IST

బంగ్లాదేశ్‌లో IPL ఫ్యాన్స్‌కు SHOCK

బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది IPL మజా ఇక కలగానే మిగలనుంది. IPL-2026 బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో హాట్‌స్టార్ అనూహ్యంగా రద్దు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం రావడం చర్చనీయాంశమైంది. దీంతో అక్కడి ప్రేక్షకులు IPL లైవ్ ధమాకాను వీక్షించే సువర్ణావకాశాన్ని కోల్పోయారు.

March 30, 2026 / 03:32 PM IST

మిస్టరీ స్పిన్నర్ పని అయిపోయిందా..?

KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ అదే సీన్ పునరావృతమైంది. MIతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. ఇదే ప్రదర్శన కొనసాగితే ‘మిస్టరీ స్పిన్నర్‌’గా గుర్తింపు పొందిన వరుణ్, ఇక ‘హిస్టరీ’గా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

March 30, 2026 / 01:27 PM IST

రోహిత్ ఫామ్‌పై MI కోచ్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ శర్మ ఫామ్‌పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఈ సీజన్‌లో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడని తెలిపాడు. ప్రాక్టీస్ క్యాంప్ మొదటి రోజు నుంచే జట్టుతో చేరి, పూర్తి ఏకాగ్రతతో సాధన చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, KKRతో అతడు ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.

March 30, 2026 / 12:09 PM IST

IPL: వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు

IPL 2026 ఓపెనింగ్ వీకెండ్ జియో హాట్‌స్టార్ రికార్డు స్థాయి వ్యూస్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లు డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. RCB, SRH మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌కు 42.6 కోట్ల (426M) వ్యూస్ లభించాయి. అలాగే, MI, KKR మ్యాచ్ 35.1 కోట్ల (351M) వ్యూస్ అందుకుంది.

March 30, 2026 / 11:58 AM IST

ధోనీ దూరం.. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్

RRతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ధోనీ గాయంతో దూరం కావడంతో సంజూ వికెట్ కీపింగ్ చేయనున్నాడని ఆ జట్టు సీఈవో తెలిపాడు. అలాగే, CSK అభిమానులు కూడా సంజూను ఎంతగానో అభిమానిస్తున్నారని ఆయన వెల్లడించాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో అతడికి అభిమానులు ఏ విధంగా స్వాగతం పలికారో చూస్తేనే, వారికి సంజూపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని పేర్కొన్నాడు.

March 30, 2026 / 11:11 AM IST

CSK vs RR: హెడ్ టు హెడ్ రికార్డ్

IPL చరిత్రలో CSK, RR మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్లు దాదాపు సమానమైన రికార్డును కలిగి ఉన్నాయి. రెండు జట్లు 31 మ్యాచ్‌ల్లో తలపడగా.. CSK 16, RR 15 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే, గత 10 మ్యాచ్‌ల్లో 8 గెలిచి RR ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సీజన్‌లో RRకు రియాన్ పరాగ్, CSKకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నారు.

March 30, 2026 / 10:50 AM IST

CSK vs RR: అందరి కళ్లు సూర్యవంశీపైనే!

CSKతో మ్యాచ్‌లో అందరి కళ్లు RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉండనున్నాయి. ఎందుకంటే గత సీజన్‌లో అతడి విధ్వంసం అలాంటిది. 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. భారత్-A, U-19లో మెరుపులు మెరిపిస్తున్న ఇతడు.. IPLలో గేల్ 175 పరుగుల రికార్డును బ్రేక్ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. దీంతో ఈ సీజన్‌లో ఎలా రాణిస్తాడో అని ఆసక్తిగా చూస్తున్నారు.

March 30, 2026 / 09:11 AM IST

గ్రీన్ బౌలింగ్‌పై రహానే కీలక వ్యాఖ్యలు

రూ.25.20 కోట్లతో KKR కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ కామెరూన్‌ గ్రీన్‌ MIతో మ్యాచ్‌లో 18 పరుగులే చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. దీనిపై కామెంటేటర్ కెప్టెన్ రహానేను ప్రశ్నించగా.. ఈ ప్రశ్న క్రికెట్ ఆస్ట్రేలియాను అడిగితే బాగుంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల వల్లే అతను బౌలింగ్ చేయడం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

March 30, 2026 / 08:43 AM IST

MI అరంగేట్రం మ్యాచ్‌లోనే ‘MOM’

KKRతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ముంబై తరపున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే శార్దుల్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందే LSG నుండి ట్రేడింగ్ ద్వారా MI శార్దుల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

March 30, 2026 / 08:28 AM IST

IPL: నేడు RR vs CSK

ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠ పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు  రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లకు ఇది ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ కావడంతో, గెలుపుతో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ధోనీ, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్న చెన్నై.. రాజస్థాన్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

March 30, 2026 / 07:10 AM IST