ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టాప్-2లో నిలవడానికి భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సహా శ్రీలంక పోటీపడుతున్నాయి. ఇటీవల పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్.. పెర్త్ టెస్టులో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ 5-0, 4-1, 4-0తో ముగిస్తే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.