అండర్-19 ఆసియా కప్లో భాగంగా గ్రూప్ ఎలో భారత్, జపాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్ (122) సెంచరీ చేశాడు. ఆయుష్ మాత్రే 54, వైభవ్ సూర్యవంశీ 23, సిద్ధార్థ్ 35, కార్తికేయ 57, హార్దిక్ రాజ్ 25 పరుగులతో రాణించారు. ఇక జపాన్ బౌలర్లలో హ్యూగో కెల్లీ 2, కీఫెర్ యమమోటో 2 వికెట్లు పడగొట్టారు.