పాకిస్థాన్లో నిర్వహించనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాలో నిర్వహించే ఐసీసీ టోర్నీలను కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలన్న పాక్ ప్రతిపాదనను మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వ్యతిరేకించాడు. భవిష్యత్లో భారత్కు పాకిస్థాన్ వెళ్లాలని.. వారిని సొంతగడ్డపైనే ఒడించి రావాలని సూచించాడు.