• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

వరల్డ్ కప్ ట్రోఫీతో సుందర్ పిచాయ్

అహ్మదాబాద్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆయన T20 ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న పిచాయ్.. ఈ విధంగా క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

February 22, 2026 / 08:58 PM IST

BREAKING: భారత్ టార్గెట్ ఎంతంటే..?

టీమిండియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 187/7 పరుగులు చేసింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ SAను బ్రెవిస్(45), మిల్లర్(63) ఆదుకున్నారు. స్టబ్స్ 44 పరుగులు చేశాడు. ఒక దశలో 12 ఓవర్లలో 117/4 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించినా, డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అడ్డుకున్నారు. బుమ్రా 3, అర్ష్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు. టార్గెట్: 188

February 22, 2026 / 08:49 PM IST

IND vs SA: బ్రెవిస్, మిల్లర్ మెరుపులు

20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా జట్టును బ్రెవిస్, మిల్లర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న బ్రెవిస్ (45)ను దూబే పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం మిల్లర్ (52*)కు తోడుగా స్టబ్స్ (1*) క్రీజులో ఉన్నాడు. SA స్కోరు 13 ఓవర్లలో 128/4.

February 22, 2026 / 08:14 PM IST

కోట్లు ఆఫర్ చేసినా ‘నో’ చెప్పిన పవన్..!

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెకండ్‌ సింగిల్‌ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గబ్బర్‌ సింగ్’ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో యాడ్స్ చేయించడానికి కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టి.. రూ.కోట్లు ఆఫర్ చేశాయని తెలిపాడు. అయితే, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది కావనే ఉద్దేశంతో పవన్ వాటిని తిరస్కరించారని చెప్పాడు.

February 22, 2026 / 07:38 PM IST

IND vs SA: సౌతాఫ్రికాకు భారీ షాక్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు. ఓపెనర్ డికాక్‌ను(6) బుమ్రా పెవిలియన్ పంపగా, మార్క్‌క్రమ్(4)ను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. దీంతో సఫారీ జట్టు 12 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 3 ఓవర్లలో 19/2 పరుగులు చేసింది. రికల్టన్(7), బ్రెవిస్(1) క్రీజులో ఉన్నారు.

February 22, 2026 / 07:20 PM IST

IND vs SA: ప్లేయింగ్-11

IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తిSA: మార్‌క్రమ్(c), డికాక్(w), రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, మార్కో యాన్‌సన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, రబాడ, లుంగి ఎన్గీడి

February 22, 2026 / 06:38 PM IST

BREAKING: టాస్ ఓడిన భారత్

అహ్మదాబాద్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య T20 WC సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 T20 WC మ్యాచ్‌ల్లో భారత్ 5 విజయాలు సాధించి ఆధిపత్యం చాటుకుంది. ఇదే రికార్డును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు SA కూడా పటిష్టంగా ఉండటంతో ఈ పోరు ఉత్కంఠగా మారింది.

February 22, 2026 / 06:30 PM IST

T20 WC: శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్

సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 146 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 95 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో షనక (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్ 3 వికెట్లు తీయగా.. ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు.

February 22, 2026 / 06:19 PM IST

అందుకే భారీ స్కోర్లు రావడం లేదు: సూర్య

పవర్‌ప్లేలో మా ఆట తీరు బాగుందని కెప్టెన్ సూర్య అన్నాడు. ‘మేము 40-50 పరుగులు చేస్తున్నాం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చాలా బాగా ఆడాం. మాపై ఇతరులకు అంచనాలు ఉండటం సహజం. ప్రతి మ్యాచ్‌లోనూ 220 – 250 పరుగులు చేయాలని ఆశిస్తుంటారు. కానీ ఇక్కడి పిచ్‌లు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు మేము ఆడిన నాలుగు పిచ్‌లు సవాలుతో కూడుకున్నవిగా ఉన్నాయి’ అని పేర్కొన్నాడు.

February 22, 2026 / 05:48 PM IST

T20 WC: పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఇంగ్లండ్ బౌలర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. విల్ జాక్స్ (3), జోఫ్రా ఆర్చర్(2) ధాటికి శ్రీలంక కేవలం 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నిస్సాంక (9), మిషారా (6), మెండిస్ (4), రత్నాయకే (0), వెల్లలాగే (10) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో కమిందు షనక (9), హేమంత(0) పోరాడుతున్నారు.

February 22, 2026 / 05:41 PM IST

సౌతాఫ్రికాపై చక్రవర్తి సూపర్ రికార్డు

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత రెండు సిరీస్‌ల్లో సౌతాఫ్రికాపై వరుణ్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 22 వికెట్లు పడగొట్టి, సఫారీ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా సత్తా చాటాడు.

February 22, 2026 / 05:27 PM IST

శిఖర్ ధావన్ రిసెప్షన్‌లో క్రికెటర్ల సందడి

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ వివాహ రిసెప్షన్ వేడుకకు స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. ఈ వేడుకకు రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి విచ్చేశారు. వీరితో పాటు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, సురేష్ రైనా తదితర ప్రముఖ క్రికెటర్లు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. కాగా ధావన్, సోఫీ షైన్‌ల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

February 22, 2026 / 04:50 PM IST

T20 WC: స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్ పరిమితం

సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఫిలిప్ సాల్ట్ (62) అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 3, మహేష్ తీక్షణ, మధుశంక తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

February 22, 2026 / 04:46 PM IST

జింబాబ్వే ఆటతీరుపై ద్రవిడ్ ప్రశంసలు

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు జింబాబ్వే చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేస్తోందని కొనియాడాడు. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నాడు. ఫైనల్లో భారత్ vs జింబాబ్వే జట్లు తలపడితే చూడాలని ఉందని ద్రవిడ్ ఆకాంక్షించాడు.

February 22, 2026 / 04:20 PM IST

ఆసియా కప్ విజేతగా భారత్

ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 134 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 88 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో తేజల్ (51) అర్ధసెంచరీతో రాణించగా, బౌలింగ్‌లో ప్రేమ రావత్ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

February 22, 2026 / 04:06 PM IST