CTR: సదుంలోని పోలీస్ గ్రౌండ్లో ఈనెల 2వ తేదీన ఉమ్మడి చిత్తూరు సీనియర్ మహిళా, పురుషుల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మమత తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 5 నుంచి 8వ తేదీవరకు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.