ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మరో రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు(1630) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతనికంటే ముందు ఆ రికార్డు 1625 పరుగులతో సచిన్ పేరిట ఉండేది. సచిన్ ఈ ఘనత 60 ఇన్నింగ్స్‌లో అందుకోగా జో రూట్ కేవలం 49 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించాడు.