• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

FIFA WC ఫైనల్‌.. టికెట్‌ ధర ఎంతంటే?

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచులు ఈ ఏడాది జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 19న అమెరికాలోని న్యూజెర్సీలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లకు భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాప్‌ కేటగిరీ టికెట్లను ఫిఫా భారీగా పెంచింది. ఒక్కో టికెట్‌ ధరను 10,990 డాలర్లు (రూ.10.19 లక్షలు)గా నిర్ణయించింది.

April 2, 2026 / 10:40 AM IST

రిటైర్‌మెంట్ ప్రకటించిన వెటరన్ ఆల్‌రౌండర్

ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ రవి బొపారా 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌కు ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొంతకాలంగా ఇంగ్లండ్ T20 బ్లాస్ట్, వన్డే కప్ మాత్రమే ఆడుతున్న అతను.. జాతీయజట్టుకు చివరిగా 2015లో ఆడాడు. ఆదే ఏడాది IPLలోనూ SRHకు ఆడాడు.

April 2, 2026 / 08:10 AM IST

IPL 2026: దూసుకెళ్తున్న షమీ

ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ తొలి బంతికే KL రాహుల్‌ని ఔట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో తన తొలి బంతికే అత్యధికంగా 5 సార్లు వికెట్ తీసిన ఆటగాడిగా షమీ దూసుకెళ్తున్నాడు. షమీ మినహా ఎవరూ ఇలా 3+ వికెట్లు తీయలేకపోవడం గమనార్హం. ప్రవీణ్ కుమార్, ఉమేష్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, భువనేశ్వర్, అశోక్ దిండా మూడేసి సార్లు ఈ ఫీట్ సాధించారు.

April 2, 2026 / 07:51 AM IST

KKR vs SRH: హెడ్ టు హెడ్ రికార్డ్స్

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్న సంగతి తెలిసిందే. IPL గణాంకాలను చూస్తే హైదరాబాద్‌పై కోల్‌కతా 20-10తో ఆధిపత్యం చలాయిస్తోంది. అలాగే SRHతో కోల్‌కతాలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో 8 ఆతిథ్య జట్టే గెలిచింది. ఇరుజట్లు ఇప్పటికే టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఓడిన నేపథ్యంలో ఇవాళ్టి పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

April 2, 2026 / 07:24 AM IST

నేడు కోల్‌కతా vs హైదరాబాద్

IPL 2026లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్‌కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఓడిన ఈ ఇరుజట్లు.. ఇవాళ ఎలా అయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్ ప్లేయర్ బ్రైండర్ కార్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో.. ఈ మ్యాచ్‌కూ దూరం కానున్నాడు.

April 2, 2026 / 06:59 AM IST

IPL-2024: రాహుల్, గోయెంకా వివాదం.. షమీ క్లారిటీ

ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్‌ను లక్నో ప్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలో మందలించిన ఘటనపై మహ్మద్ షమీ స్పందించాడు. ‘జట్టుపై పెట్టుబడి పెట్టినప్పుడు ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించడం సహజమే. అది యజమానికి ఉండే ‘పొజెసివ్‌నెస్’. అందులో తప్పేమీ లేదు’ అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం షమీ లక్నో జట్టులో భాగమైన సంగతి తెలిసిందే.

April 2, 2026 / 01:37 AM IST

BREAKING: లక్నోపై ఢిల్లీ ఘన విజయం

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 17.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లు సమీర్ రిజ్వీ (70*) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. స్టబ్స్(39*)తో రాణించాడు. లక్నో బౌలర్లు ప్రిన్సి యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగాడు. షమీ, మోషిన్ ఖాన్ తలో వికెట్ తీశారు.

April 1, 2026 / 11:02 PM IST

LSG vs DC: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 4 కీలక వికెట్లు కోల్పోయింది. 25 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (0), నిశాంక (1), నితీశ్ రాణా (15) వరసగా పెవిలియన్ చేరారు. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ 33/4గా ఉంది. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్ (6*), రిజ్వీ (0*) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 84 బంతుల్లో 109 పరుగులు అవసరం.

April 1, 2026 / 10:04 PM IST

LSG vs DC: మొదటి బాల్‌కే కేఎల్ రాహుల్ ఔట్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. మోహ్సిన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోర్ 20/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రాణా (15*), నిశాంక (1*) ఉన్నారు. DC టార్గెట్ 142 పరుగులు.

April 1, 2026 / 09:44 PM IST

BREAKING: లక్నో ఆలౌట్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మార్ష్ 35, అబ్దుల్ సమద్ 36 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లు.. కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

April 1, 2026 / 09:14 PM IST

LSG vs DC: కష్టపడుతున్న లక్నో బ్యాటర్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 105 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ముకుల్ చౌదరి (14) వెనుదిరిగాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండగా.. LSG బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడుతున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి LSG 121 పరుగులు చేసింది.

April 1, 2026 / 08:51 PM IST

LSG vs DC: 5 వికెట్లు డౌన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 35 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోర్ 80/5గా ఉంది. అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలరల్లో అక్షర్ పటేల్, నటరాజన్, ఎంగిడి, కుల్దీప్ తలో వికెట్ తీశారు.

April 1, 2026 / 08:30 PM IST

LSG vs DC: ఇరు జట్ల తుది జాబితా ఇదే

LSG XI: మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (C), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మోహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోకియా, ప్రిన్స్‌యాదవ్. DC XI: కేఎల్ రాహుల్, పాథుమ్ నిశ్శాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (C), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కుల్‌దీప్ యాదవ్, టి.నజరాజన్, ముఖేశ్ కుమార్.

April 1, 2026 / 07:30 PM IST

IPL 2026: పంత్‌పై ఒత్తిడి.. ఈ సీజన్ సవాలే!

IPL 2026లో లక్నో సూపర్ జెయింట్స్ టైటిల్ వేటకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. అయితే, LSG కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఈ సీజన్ సవాల్‌గా మారనుంది. అతడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. LSG తరఫున 2025లో తన తొలి సీజన్‌లో పంత్ కెప్టెన్‌గా, ప్రధాన బ్యాటర్‌గా రాణించలేకపోయిన విషయం తెలిసిందే.

April 1, 2026 / 07:26 PM IST

BREAKING: టాస్ గెలిచిన ఢిల్లీ

IPL 2026లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు LSGతో తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ గెలవడం విశేషం. దీంతో ఈసారి ఎలాగైనా DCపై గెలుపొందాలని LSG కసితో బరిలోకి దిగుతోంది.

April 1, 2026 / 07:02 PM IST