టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్జే ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె హిట్మ్యాన్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇన్స్టా వేదికగా వారి కుమారుడి పేరును షేర్ చేసింది. నాలుగు క్రిస్మస్ బొమ్మలపై తమ పేర్లతో పాటు చిన్నారి పేరు కూడా రాసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. తమ రెండో బిడ్డకు ‘అహాన్’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. రితికా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.