క్రికెట్లో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలవుతుంటాయి. అయితే కొన్ని రికార్డులను మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. సచిన్ రికార్డుల తరహాలో మరో భారత క్రికెటర్ కూడా ఎవరూ అందుకోలేని రికార్డు నమోదు చేశాడు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ వేశాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ రికార్డును అందుకోలేదు. కాగా ఆ మ్యాచ్‌లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు.