వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జోరందుకుంది. ఈ అంశంపై భారత్ స్పిన్ బౌలర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడాడు. కోహ్లీయే ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపారు. కెప్టెన్‌గా విరాట్‌ను మించిన వారు ప్రస్తుతం ఆర్సీబీలో కనిపించడం లేదని చెప్పారు. ఈ సారి వేలంలో ఆర్సీబీ బ్యాలెన్సింగ్‌గా ప్లేయర్లను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.