సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ అదరగొట్టింది. ఫైనల్లో 21-18, 21-11 తేడాతో చైనాపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో టైటిల్‌ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. గాయత్రి-ట్రీసా జోడీకిది తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం.