టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాపై మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఒకవేళ వేలంలోకి వచ్చి ఉంటే రూ.520 కోట్ల పర్స్ వాల్యూ కూడా సరిపోదని అన్నాడు. ఆల్టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యేవని పేర్కొన్నాడు. అతడి కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడవని చెప్పుకొచ్చాడు. కాగా, బుమ్రాను ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.