ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్, భారత్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవన్ 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సామ్ కాన్స్టస్ (107) సెంచరీ చేశాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన హన్నో జాకబ్స్ 61 పరుగులు చేశాడు. ఇక టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, ఆకాశ్ దీప్ 2, జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.