విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం విదర్భ, రైల్వేస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు సాయంత్రం 04:30 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు రాత్రి 08:30 తెలిపారు. ఉదయం ఛత్తీస్గఢ్, ఒడిస్సా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వలన రద్దయిన విషయం తెలిసిందే.