ఇటీవల ముగిసిన IPL మెగా వేలంలో దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి దక్కించుకుంటుందని CSK అభిమానులు భావించారు. అయితే రూ.9.25 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ మాట్లాడుతూ.. ‘ప్రారంభం నుంచి ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. అందుకే సీఎస్కేలోకి వెళ్లాలనుకున్నా. ఈ సారి నా పేరు వేలంలోకి వచ్చేసరికి చెన్నై వద్ద రూ.13 కోట్లే ఉన్నాయి. అయినా, నా కోసం రూ.9 కోట్ల వరకు బిడ్ వేసింది’ అని వివరించారు.