టీ20 ప్రపంచ కప్ ముగిసింది. ఆ టోర్నీకి సంబంధించి పదకొండు మంది ఆటగాళ్లతో ఐసీసీ ‘టీం ఆఫ్ ద టోర్నమెంట్’ని ప్రకటించింది. ఇండియన్ క్రికెటర్లు అత్యధికంగా ఆరుగురు ఈ టీంలో చోటు దక్కించుకున్నారు. ఎవరంటే?
రోహిత్ శర్మ టీ 20 ఆటకు గుడ్ బై చెప్పాడు. సుదీర్ఘ కాలం పాటు పొట్టి క్రికెట్ ఆటను ఆస్వాదించిన రోహిత్ శర్మ ... వరల్డ్ కప్ విజయం తర్వాత తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని నూతన సెక్రటేరియట్ ముందు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఉత్కంఠ పోరులో పైచేయి సాధించి..సఫారీలను మట్టికరిపించింది. పైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాడినికి ఏ ఏ అంశాలు కలిసొచ్చాయి? చేజారుతోంది అనుకున్న మ్యాచ్ ఏవిధంగా పట్టుబిగిసిందో సమీక్షిద్దాం.
టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ పోరులో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన ఫైనల్ చేరింది. సౌతాఫ్రికా జట్టుతో తుదిపోరులో తలపడనుంది. ఇంతకీ సెమీస్ ఫైట్‌లో భారత విజయానికి ఎవరు దోహదపడ్డారు? ఇంగ్లండ్ జట్టు దారుణంగా ఆడిందా? భారత జట్టు అద్భుతంగా ఆడిందా? ఇంగ్లండ్ జట్టుపై విజయానికి భారత బ్యాటర్లు కారణమా, బౌలర్లు కారణమా? క్రికెట్ విశ్లేషకులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు? ...
భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. బాల్ రివర్స్ స్వింగ్ వేసిన మాట వాస్తవమే అని, వాతావరణ పరిస్థితులను బట్టి బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని పేర్కొన్నారు.
పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుకు వరల్డ్ కప్‌లో ఘోర పరాభవం ఎదురయింది. సెమీస్ చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సెమీస్‌లో ప్రవేశించింది. సూపర్ 8 గ్రూప్-1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆఫ్ఘన్ జట్టు సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది.
టీ 20 వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదౌతున్నాయి. పటిష్టమైన జట్లు చతికిల పడుతున్నాయి. పసికూనలుగా ముద్ర పడ్డ జట్లు చెలరేగి ఆడుతున్నాయి. తాజాగా ఆఫ్ఘన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసుకుంది.
క్రికెటర్ షమీని బ్యాట్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్లాడబోతున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయమై సానియా మీర్జా తండ్రి స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల వేసిన ఫెర్గసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గినియా జట్టు కేవలం 78 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టీ20 వరల్డ్ కప్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. పసికూనలుగా భావించిన జట్లు ఇరగదీశాయి. పటిష్టమైనవి భావించిన జట్లు ఇంటి బాట పట్టాయి. దీంతో సూపర్ 8 బెర్తులు ఖరారయ్యాయి. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు సూపర్ 8కి చేరుకుంది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సూపర్ 8 కి చేరుకుంది. అలాగే మొత్తం జట్లు కూడా ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడుతూ తమ ఫిట్ నెస్‌ను కాపాడుకుంటున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఎప్పటిలాగే ఉత్సహాంగా ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగులు వేస్తున్న అమెరికా టీ20 క్రికెట్ సూపర్ 8లోకి దూసుకెళ్లిపోయింది. ఏళ్ల అనుభవం ఉన్న పాకిస్థాన్ జట్టు సిరీస్ నుంచి ఔట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.