న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ టీమిండియాతో జరగబోయే మూడో టెస్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మేం ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్నాం. మూడో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాం. భారత్‌ను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేయడం చాలా కష్టం. మేము భారత్‌తో సిరీస్ గెలుస్తాం అని ఎవరూ ఊహించి ఉండరు. చివరి మ్యాచ్ కూడా గెలిస్తే సంతోషంగా ఇంటికెళ్లగలం’ అని తెలిపాడు.