ఇటీవల హార్దిక్ ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. దీంతో టెస్టుల్లోకి వచ్చేస్తాడంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హార్దిక్ పాండ్యాను టెస్టుల్లో చూస్తానని అనుకోవడం లేదు. నాకు తెలిసి అతడు ఆ రోజు రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేయడానికి కారణం తెల్ల బంతి దొరికి ఉండకపోవచ్చు. పాండ్య శరీరం నాలుగైదు రోజుల గేమ్‌కు సరిపోదు’ అని పేర్కొన్నాడు.