నాకౌట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత్‌ను ఓడించలేదు. ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్‌లలో రెండుసార్లు తలపడ్డాయి. భారత్ రెండింటిలోనూ గెలిచింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి. భారత్ విజయం సాధించింది. 2024 ఫైనల్‌లో భారత్ గెలుపొందింది. IND, SA ఫామ్‌ను పరిశీలిస్తే.. రెండు జట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.
T20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సా.7 గంటలకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 21 మ్యాచుల్లో భారత్, 13 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, టీమిండియాదే పైచేయి అనిపిస్తుంది.
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు పతకాలు సాధించింది. 10 కిలో మీటర్ల పరుగు పోటీలో హర్మన్‌జ్యోత్ రజతం గెలుచుకున్నాడు. టీమ్ పోటీల్లో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. అండర్-20లో మహిళలు, పురుషుల జట్లు కాంస్యం గెలిచాయి. మహిళల 10 కిలోమీటర్ల టీమ్ విభాగంలో భారత బృందం కంచు నెగ్గింది.
అంధుల క్రికెట్‌లో టీమిండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ క్రికెట్‌లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారని బీసీసీఐ అధ్యక్షుడు మిథన్ మన్హాస్ కొనియాడారు. వారి విజయాలు భారత క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్లేయర్లకు గుర్తింపును అందించడమే బీసీసీఐ లక్ష్యమని మిథున్ వెల్లడించారు.
ఇటీవల అంధుల క్రికెట్‌లో టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రపంచకప్‌లను గెలిచాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, స్వదేశం వేదికగా జరిగే ద్వైపాక్షిక సిరీసుల్లో పాల్గొనే ప్లేయర్లకు వసతితో పాటు దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులు ఆడే సదుపాయం కల్పించనుంది.
పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. కాగా, రేపు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
టీ20 ప్రపంచకప్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంగా అదిరిపోయే ఆరంభాలతో జట్టును ఆదుకున్న అభిషేక్, ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతడి ఫామ్ లేమి జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు సౌతాఫ్రికాతో జరగే సూపర్-8 పోరులోనైనా అభిషేక్ జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రేపు కీలక పోరు జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు భారత్ తన విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కాగా, T20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌తో సఫారీలు 7 సార్లు తలపడగా.. 5 సార్లు టీమిండియానే విజయం సాధించింది.
పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాగా, వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దాదాపు ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, రెండు జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు సహచర క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ధావన్‌కు తన మొదటి భార్యతో ఒక కుమారుడు ఉన్నాడు. ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ రేసులో తొలి అడుగు వేయాలని చూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో హర్మన్‌ప్రీత్ సేన కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ 176 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. కాగా, ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అభిషేక్ స్పందించాడు. తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని అతను స్పష్టం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా తాను ఇదే దూకుడుతో ఆడుతున్నానని, భవిష్యత్తులో కూడా అదే ఆటతీరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు వ్యూవర్‌షిప్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ దాయాది జట్లు మరో కీలక టోర్నీలో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్‌లో క్రికెట్ కూడా ఉండటంతో, అక్కడ IND-PAK పోరు జరిగే అవకాశం ఉంది.