ఐపీఎల్లో పది ఫ్రాంచైజీలు తమ టీమ్‌లో ఎవరిని కొనసాగిస్తాయనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఇప్పటికే ప్రతి జట్టు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ పాలక మండలికి అందజేసాయి. ఈ జాబితాను ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జియో సినిమా ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.