• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

RCB vs CSK: విరాట్ కోహ్లీ ఔట్

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు చేసి అవుటయ్యాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి, దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, కోహ్లీ 6 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను అంతకుముందే దూబే జారవిడిచాడు. వచ్చిన ఆ అవకాశాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

April 5, 2026 / 07:59 PM IST

RCB vs CSK: తుది జట్లు ఇవే

CSK: శాంసన్(w), గైక్వాడ్(c), మాత్రే, సర్ఫరాజ్, దూబే, ప్రశాంత్, ఓవర్టన్, అహ్మద్, అన్షుల్, హెన్రీ, ఖలీల్. IMPACT: మాథ్యూ షార్ట్, అకీల్ హోసేన్, కార్తిక్ శర్మ, రామకృష్ణ ఘోష్, గుర్జప్నీత్ సింగ్.RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, పాటిదార్(c), జితేష్(w), డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, జాకబ్ డఫీ. IMPACT: సుయాష్, బెథెల్, రసిఖ్ దార్, కనిష్క్, వెంకటేష్ అయ్యర్

April 5, 2026 / 07:20 PM IST

BREAKING: హోమ్ గ్రౌండ్‌లో SRHకు షాక్

ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను LSG చిత్తు చేసింది. 157 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.5 ఓవర్లలో ఛేదించి, 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంత్(68*) హాఫ్ సెంచరీతో రాణించగా, మార్‌క్రమ్ 45 పరుగులు చేశాడు. SRH బౌలర్లలో దూబే 2.. మలింగ, శివాంగ్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ సీజన్‌లో SRHకి ఇది రెండో పరాజయం.

April 5, 2026 / 07:10 PM IST

BREAKING: టాస్ గెలిచిన CSK

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB, CSK మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కీలక ప్లేయర్లు గాయాలతో దూరం కావడంతో CSK బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. దీంతో ఈ పోరులో పటిష్టమైన RCB జట్టును CSK ఎలా ఎదుర్కోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

April 5, 2026 / 07:00 PM IST

అభిషేక్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు

LSGతో మ్యాచ్‌లో డకౌట్ కావడంతో అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ (17), రహానే (16), గంభీర్ (15), ధావన్ (15) తర్వాత 14 డకౌట్లతో అభిషేక్ నిలిచాడు. అలాగే, ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్‌గా రోహిత్ (6) సరసన అగ్రస్థానంలో నిలిచాడు.

April 5, 2026 / 05:31 PM IST

RCB vs CSK: హెడ్ టు హెడ్ రికార్డు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కాసేపట్లో RCB, CSK జట్ల మధ్య హైవోల్టేజ్ పోరు జరగనుంది. ఈ రెండు జట్లు గతంలో 35 మ్యాచ్‌ల్లో తలపడగా, CSK 21 విజయాలతో పైచేయి సాధించింది. RCB 13 మ్యాచ్‌ల్లో గెలవగా, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఇరుజట్లు చెరో 5 విజయాలతో సమానంగా ఉన్నాయి.

April 5, 2026 / 05:27 PM IST

నితీష్, క్లాసెన్ పోరాటం.. SRH స్కోర్ ఎంతంటే?

LSGతో మ్యాచ్‌లో SRH బ్యాటర్లు తడబడ్డారు. లక్నో బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 156/9 పరుగులే చేయగలిగింది. ఒక దశలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును, 116 పరుగుల భాగస్వామ్యంతో నితీష్(56), క్లాసెన్(62) ఆదుకున్నారు. అభిషేక్(0), హెడ్(7), ఇషాన్(1), లివింగ్‌స్టోన్(14) ఘోరంగా విఫలమయ్యారు. షమీ, ప్రిన్స్, అవేష్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

April 5, 2026 / 05:15 PM IST

SRH vs LSG: నితీష్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు

లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో SRH పోరాడుతోంది. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును నితీష్ రెడ్డి, క్లాసెన్ ఆదుకున్నారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు బ్యాటర్లు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం SRH 16.4 ఓవర్లలో 128/4 పరుగులు చేసింది.

April 5, 2026 / 04:58 PM IST

SRHపై నిప్పులు చెరిగిన షమీ

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మహ్మద్ షమీ ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌పై నిప్పులు చెరిగాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో LSG ఫ్రాంఛైజీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్‌పై కృణాల్ పాండ్యా (11/2) పేరిట ఉన్న రికార్డును షమీ బ్రేక్ చేశాడు.

April 5, 2026 / 04:26 PM IST

IPL: సెహ్వాగ్-గంభీర్ రికార్డ్ బ్రేక్

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ జోడీ యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని (బంతుల పరంగా) నెలకొల్పిన భారత జోడీగా వీరు అరుదైన రికార్డు సాధించారు. కేవలం 248 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో 2008లో ఢిల్లీ తరఫున సెహ్వాగ్-గంభీర్ (309 బంతులు) నెలకొల్పిన 18 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు.

April 5, 2026 / 04:15 PM IST

SRH చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్

సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి SRH 3 వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది. ఇది IPL చరిత్రలో సన్‌రైజర్స్‌కు రెండో అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. గతంలో 2022లో రాజస్థాన్ రాయల్స్‌పై 14/3 స్కోర్ చేయడమే ఇప్పటికీ అతి తక్కువ స్కోర్‌గా ఉంది.

April 5, 2026 / 04:07 PM IST

SRH చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్

సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి SRH 3 వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది. ఇది IPL చరిత్రలో సన్‌రైజర్స్‌కు నాలుగో అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. గతంలో 2022లో రాజస్థాన్ రాయల్స్‌పై 14/3 స్కోర్ చేయడమే ఇప్పటికీ అతి తక్కువ స్కోర్‌గా ఉంది.

April 5, 2026 / 04:07 PM IST

SHOCK: సన్‌రైజర్స్ ఓపెనర్లు ఔట్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. లక్నో బౌలర్ షమీ SRH ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. అభిషేక్ శర్మ కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ‘డకౌట్’ కాగా, ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే హెడ్ (7)ను కూడా షమీ ఔట్ చేశాడు. దీంతో కేవలం 8 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్, లివింగ్‌స్టోన్ ఉన్నారు.

April 5, 2026 / 03:47 PM IST

SRH vs LSG: సన్‌రైజర్స్ జట్టులో రెండు మార్పులు

SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), క్లాసెన్, లివింగ్‌స్టోన్, అనికేత్, నితీష్, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఉనద్కత్LSG: మార్ష్, పంత్(w/c), మర్‌క్రమ్, పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, సిద్ధార్థ్, అవేష్ ఖాన్, షమీ, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

April 5, 2026 / 03:10 PM IST

SRH vs LSG: పిచ్ రిపోర్ట్

హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 190+ పరుగులుగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. అయితే, గత సీజన్‌లో ఇక్కడ జరిగిన 5 మ్యాచ్‌ల్లో 4 సార్లు ఛేజింగ్ జట్లే గెలిచింది. ఇదే స్టేడియంలో SRH 2025లో RRపై 286/3 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

April 5, 2026 / 02:43 PM IST