తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టు కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ విఫలమవడంతో ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం భారత ఆటగాళ్లు నెట్ సెషన్స్‌లో పాల్గొనగా.. మిగతా వారి కంటే రోహిత్ శర్మ, పంత్ గంట ముందే ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా భారత్- ఆసీస్ మధ్య రెండో టెస్టు ఈ నెల 6న ప్రారంభం కానుంది.