విజయవాడలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను శాప్ ఛైర్మన్ రవినాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాలను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. 2027 జాతీయ క్రీడలు నిర్వహించే దిశగా కార్యచరణ చేస్తున్నామన్నారు.