వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ క్రికెటర్ పృథ్వీషాకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీకి మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించాడు. పృథ్వీషా విజయవంతం కావాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటే అతన్ని సోషల్ మీడియాకు దూరం ఉండమని చెప్పాలన్నాడు.